నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:38 AM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా జరుగనున్నాయి. సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
జమ్మికుంట, నవంబర్ 11 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా జరుగనున్నాయి. సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సీసీఐ నిబంధనలకు వ్యతిరేకంగా జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపి వేస్తామని నోటీస్ ఇచ్చారు. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎప్పటిలాగే పత్తి అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చిన రైతులు ఆందోళన చెందారు. రైతుల పరిస్థితిని గమనించిన మార్కెట్ అధికారులు గ్రేడ్-2 వ్యాపారులతో పత్తి కొనిపించారు. వారు క్వింటాల్‌కు 6,750 రూపాయలు చెల్లించి పత్తి కొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:38 AM