ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:00 AM

గణేష్‌ నిమజ్జన శోభయాత్ర ఏర్పాట్లను బుధవారం రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ పరిశీలించారు.

యైుటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 11: గణేష్‌ నిమజ్జన శోభయాత్ర ఏర్పాట్లను బుధవారం రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ పరిశీలించారు. నిమజ్జనం జరగనున్న గోదావరి వంతెన వద్ద బందోబస్తు ఏర్పాట్లు, లైటింగ్‌, గజ ఈతగాళ్ళు, మంచినీటి వసతి ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరిఖనితో పాటు మంచిర్యాల, శ్రీరాంపూర్‌, జైపూర్‌, రామకృష్ణాపూర్‌ ప్రాంతాల నుంచి గణపతి ప్రతిమలను నిజమజ్జనానికి తీసుకురానున్న దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాల రూట్‌ క్లియర్‌, ట్రాఫిక్‌ మళ్లింపు ప్రాంతాలను సీపీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనానికి సంబంధించి అన్నిప్రభుత్వ శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కమిషనర్‌ వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, రామగుండం మున్సిప ల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ సీ రాజు, ఏసీపీలు రమేష్‌, వెంకటేశ్వర్లు, గోదావరిఖని వన్‌టౌన్‌ టూటౌన్‌, శ్రీరాంపూర్‌ సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, మోహన్‌తో పాటు మున్సిపల్‌, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:00 AM

Advertising
Advertising