ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి

ABN, Publish Date - Jun 24 , 2024 | 12:45 AM

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది.

ఓదెల, జూన్‌ 23 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి దాదాపు పదివేల మందికి పైగా వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఒకేరోజు ఆలయానికి రూ.నాలుగు లక్షల మేరకు ఆదాయం సమకూరిందని అధికారుల అంచనా. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు మూడు గంటల సమయం పట్టింది. ఆరుద్ర కార్తెలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉన్నందున ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ మేరకు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. అలాగే కోడే మొక్కులు, బోనాలు, సమర్పించారు. అనంతరం మదనపోచమ్మ, బంగారు పోచమ్మ, వీరభద్రస్వామి రామాలయాన్ని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఆదివారం, బుధవారం జాతరలో వైద్యం సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన సిబ్బంది కనబడకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. పరకాల మండలానికి చెందిన కొందరు భక్తులు తీవ్రమైన ఉక్కపోతతో అస్వస్థకు గురికాగా చికిత్స కోసం దేవాలయంలోకి వచ్చారు. అక్కడ వైద్య సిబ్బంది లేకపోయేసరికి ఆటోలో పెగడపల్లిలోని ఒక ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స పొందారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున జాతరలో నీరు కలుషితం అయ్యే పరిస్థితి ఉన్నందున వైద్య సేవలు అందేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 12:45 AM

Advertising
Advertising