ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘స్మార్ట్‌సిటీ’లో చిమ్మ చీకట్లు

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:30 AM

గతంలో నగరంలోని స్మార్ట్‌ రోడ్లన్నీ వెలుగులతో జిగేల్‌మనేవి. రోడ్డుకు ఇరువైపులా ఆకర్షణీయమైన వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో కాలనీలు మెరిసిపోయాయి.

కరీంనగర్‌ బైపాస్‌లో వెలగని స్ట్రీట్‌ లైట్లు

- నాలుగైదు నెలలుగా వెలుగని లైట్లు

- పట్టించుకోని అధికారులు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గతంలో నగరంలోని స్మార్ట్‌ రోడ్లన్నీ వెలుగులతో జిగేల్‌మనేవి. రోడ్డుకు ఇరువైపులా ఆకర్షణీయమైన వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో కాలనీలు మెరిసిపోయాయి. ఒకప్పటి కరీంనగర్‌కు ఇప్పటి కరీంనగర్‌కు ఎంతో తేడా కనిపిస్తోందని నగరానికి వచ్చే వారు ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు అవే రోడ్లలో చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. ఐదారు నెలలుగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన వీధిదీపాలు చాలా చోట్ల చెడి పోయాయి. వాటిని పట్టించుకుని లైట్లను మార్చక పోవడంతో చీకటి రోడ్లను చూసి స్మార్ట్‌సిటీ హంగులు మూడునాళ్ల ముచ్చటేనా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఫ కనీస నిర్వహణ కరువు

కోట్ల రూపాయలతో నగరంలోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారులు మినహా మిగిలన అంతర్గత రోడ్లను స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. హౌసింగ్‌ బోర్డుకాలనీని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అందమైన లైట్లను బిగించారు. నాలుగైదు నెలలుగా అక్కడ లైట్లు వెలుగక పోవడంతో చీకట్లు అలుముకుంటున్నాయి. వాటికి కనీస నిర్వహణ లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. కలెక్టరేట్‌ ముందు నుంచి వెళ్లే ప్రధాన రహదారిలో కూడా అక్కడక్కడ లైట్లు వెలగడం లేదు. వాటిని పట్టించుకునే వారే కనిపించడం లేదు. ఎంఆర్‌ గార్డెన్‌, ఎస్‌బీఎస్‌ రోడ్‌, శాతవాహన యూనివర్శిటి రోడ్‌, కోతిరాంపూర్‌, గాంధీరోడ్డు, ఇలా స్మార్ట్‌సిటీ రోడ్లలో రాత్రివేళల్లో వీధిదీపాలు వెలగడం లేదు. స్మార్ట్‌సిటీలో చీకట్లు కనిపించడం లేదా అంటూ ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఐదారు నెలల నుంచి స్మార్ట్‌సిటీ లైట్లు వెలుగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన లైట్ల మరమ్మతులు, నిర్వహణ ఆ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ చేయాల్సి ఉంటుందని మున్సిపల్‌ ఎలక్ర్టికల్‌ విభాగం సిబ్బంది అంటున్నారు. కాంట్రాక్టర్‌ వీధి దీపాల నిర్వహణను గాలికి వదిలి వేశారని, ఆ లైట్లకు సంబంధించిన విడిబాగాలు తమ వద్ద లేవని చెబుతున్నారు.

ఫ ఇబ్బందుల్లో నగరవాసులు

మరోవైపు నగరపాలక సంస్థకు సంబంధించిన వీధి దీపాలూ వెలుగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ఈ రోడ్ల నుంచి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ప్రజాప్రతినిధులు వెళ్తున్నారే కానీ వీధిదీపాలను పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లైట్ల నిర్వహణను పూర్తిగా మరిచిపోయారని, కాంట్రాక్టర్‌తో ఎందుకు పనులు చేయించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలోని వీధిదీపాలు వెలిగేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:30 AM