ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్పొరేషన్‌ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:43 AM

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభి వృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పేర్కొ న్నారు.

కోల్‌సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభి వృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పేర్కొ న్నారు. బుధవారం నగరపాలక సంస్థ 38వ డివిజన్‌ ఇందిరానగర్‌లో రూ.40లక్షల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో ఓపెన్‌ డ్రైన్‌, సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీయూఎఫ్‌ఐడీసీ పథకం కింద రోడ్లు, డ్రైనేజీ, నగర సుందరీకరణ తదితర పనులకు రూ.100కోట్ల నిధులు వెచ్చిం చగా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎస్‌టీపీల పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. నగర సుందరీకరణలో అనేక మార్పులు తీసుకువస్తామన్నా రు. మాజీ ఎమ్మెల్యే రామగుండం నగరపాలక సంస్థకు రావాల్సిన నిధులను కమిష న్లకు కక్కుర్తిపడి బీఆర్‌ఎస్‌ అగ్రనాయకులకు ధారదత్తం చేశారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నా లు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్లు జంగంపల్లి సరోజన, ముస్తాఫా, నాయకులు దీటి బాలరా జు, మేకల పోషం, నజీమోద్దీన్‌, రాజిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:43 AM