ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యత లేని చేప పిల్లలు మాకొద్దు..

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:09 AM

నాణ్యత, నిర్ణీత సైజు లేని చేప పిల్లలు తమకు వద్దంటూ మత్స్యకారులు వాపస్‌ పంపిస్తున్నారు. చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత లేని, తక్కువ సైజుగలవి సరఫరా చేస్తున్నా కూడా సంబంధిత మత్స్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

చేప పిల్లలను పరిశీలిస్తున్న కొలిపాక నర్సయ్య, మత్స్యకారులు

- కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు

- నాణ్యత పరిశీలించకుండానే సరఫరాకు అనుమతి

- తిరస్కరించి వాపస్‌ పంపిస్తున్న మత్స్యకారులు

- బదులుగా నగదు పంపిణీ చేయాలని డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నాణ్యత, నిర్ణీత సైజు లేని చేప పిల్లలు తమకు వద్దంటూ మత్స్యకారులు వాపస్‌ పంపిస్తున్నారు. చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత లేని, తక్కువ సైజుగలవి సరఫరా చేస్తున్నా కూడా సంబంధిత మత్స్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం అధికారులు కాంట్రాక్టర్లు పెంచుతున్న చేపపిల్లల ఫామ్‌ల వద్దకు వెళ్లి వాటి నాణ్యత, సైజులను కూడా పరిశీలించకుండానే సరఫరాకు అనుమతించడం అనుమానాలకు తావిస్తున్నది. నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మత్స్య శాఖ అధికారులు ప్రారంభించారు. చేపలను పరిశీలించిన మత్స్యకారులు వాటిని తిరిగి వాపస్‌ పంపిస్తున్నారు. శనివారం అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, మంథని మండలాల్లోని చెరువులు, కుంటల్లో ఉచిత చేప పిల్లలను పోసేందుకు జిల్లా మత్స్య శాఖాధికారి భాస్కర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో తీసుకవచ్చిన చేప పిల్లలను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య, డైరెక్టర్లు శ్రీకాంత్‌, పెద్దపల్లి సుజాత, పోశం, వీరస్వామి, క్రాంతి, తాళ్ల తిరుపతి, పి మొండయ్య తమకు వద్దంటూ వాపస్‌ పంపించారు. 35 నుంచి 40 ఎంఎం సైజు ఉండాల్సిన చేప పిల్లలు కనీసం 20 శాతం కూడా లేవని, నాణ్యత లేని చేప పిల్లలను ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. వాటిని ఎలా అనుమతించారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ వస్తున్నది. చిన్నచిన్న చెరువులు, కుంటల్లో 35 నుంచి 40ఎంఎం సైజుగల చేప పిల్లలు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 80 నుంచి 100 ఎంఎం సైజుగల చేప పిల్లలను పోయాల్సి ఉంటుంది. వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సొంతంగా ఫిష్‌ పాండ్‌లు, ఫామ్‌లు, హేచరీస్‌ ఉన్నవారి నుంచి టెండర్లను ఆహ్వానించి ప్రతి ఏటా పంపిణీ చేస్తున్నది. ఈ చేప పిల్లలను కాంట్రాక్టర్లు నాణ్యత లేనివి, తక్కువ సైజు గల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఏటా వినవస్తున్నాయి. సకాలంలో చెరువుల్లో చేప పిల్లలు పోయని కారణంగా, మత్స్య సహకార సంఘాలే పిల్లలను బయట కొనుగోలు చేసి చెరువుల్లో పోస్తున్నారు.

ఫ కోటి 90 లక్షల చేప పిల్లలు పోయాలని..

జిల్లాలోని 1018 చెరువులు, కుంటలు, శ్రీపాద ఎల్లంపల్లి, పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీ, సరస్వతీ (అన్నారం) బ్యారేజీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక కోటి 90 లక్షల చేప పిల్లలు పోయాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించినప్పటికీ, 78 లక్షల 80 వేల 205 చేప పిల్లలను సరఫరా చేసేందుకు చిలుక సురేష్‌, వినోద్‌ అనే కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారు. వాస్తవానికి చేప పిల్లలను జూలై 15 తర్వాత చెరువుల్లో పోయాల్సి ఉండగా, టెండర్లలో జాప్యం జరగడంతో ఇప్పటికే మత్స్యకారులు సొంతంగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్‌గా సీడ్‌ కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లలు నిర్ణీత సైజులో లేకపోవడం, నాణ్యత లేని కారణంగా వాటిని తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి 35 నుంచి 40 ఎంఎం సైజు గల చేప పిల్లలు ప్రైవేట్‌ ఫామ్‌ల్లో ఒక చేప పిల్ల రూపాయి నుంచి రూపాయి 20 పైసలకు, 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేప పిల్లలు దొరికితే, కాంట్రాక్టర్లు మాత్రం అంతకంటే తక్కువ ధరకే టెండర్లు వేసి నిర్ణీత ప్రమాణాలు పాటించడం లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత లేని, తక్కువ సైజుగల చేప పిల్లలను అంటగట్టి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని, ఈ వ్యవహారంపై జిల్లా మత్స్య శాఖాధికారి పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చేప పిల్లల నాణ్యత, సైజును పరిశీలించిన తర్వాతనే పంపిణీ చేయాల్సి ఉండగా, అదేమి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చేప పిల్లలకు బదులు వాటి కోసం ప్రభుత్వం వెచ్చించే సొమ్మును మత్స్య సహకార సంఘాలకు ఇస్తే చేప పిల్లలను కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో పోసుకుంటామని మత్స్యకారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టెండర్లను రద్దు చేసి నగదు సొమ్ము ఇవ్వాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ చేప పిల్లలకు బదులు నగదు అందజేయాలి..

- కొలిపాక నర్సయ్య, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తాత్కాలిక చైర్మన్‌

నాణ్యత లేని, తక్కువ సైజు చేప పిల్లలను చెరువులు, కుంటల్లో పోయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ వెంటనే అవి చని పోతాయి. వారం రోజుల నుంచి జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ చేపట్టారు. నాణ్యత లేని, తక్కువ సైజుగల చేప పిల్లలను పోసేందుకు కాంట్రాక్టర్లు తీసుకరాగా వాటిని తిరస్కరించాం. అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, మంథని మండలాల్లోని చెరువుల్లో చేప పిల్లల పోయడాన్ని మత్స్యకారులు అడ్డుకుంటున్నారు. జూన్‌, జూలై మాసంలోనే చేప పిల్లలు పోయాల్సి ఉండగా, మూడు నెలలు ఆలస్యం చేయడం వల్ల ప్రయోజనం లేదు. చేప పిల్లలకు బదులు సంఘాలకు నగదు పంపిణీ చేస్తే, సకాలంలో నాణ్యతగల చేప పిల్లలను కొనుగోలు చేసి పెంచుకుంటాం. దీని వల్ల మాకు లాభం చేకూరనున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి నగదు పంపిణీ చేయాలి.

Updated Date - Oct 20 , 2024 | 01:09 AM