ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత వాతావరణంలో విద్య

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:41 AM

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షిత వాతావరణంలో విద్య నేర్పుతారని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

అన్నప్రాసన చేస్తున్న కలెక్టర్‌

గంగాధర, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షిత వాతావరణంలో విద్య నేర్పుతారని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం ఆచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఐఈడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 78 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, ఇది మంచి విషయమన్నారు. మంచి ఆహారం, శుభ్రమైన తాగునీరు, సరిపడా నిద్ర వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని మహిళలకు సూచించారు. ఆరుసంవత్సరాల లోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన అన్ని మందులూ నిల్వ ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకొవాలని కోరారు. సుమారు 50 వేల ఖర్చయ్యే పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తామని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి బలవర్థకమైన ఆహారం తీసుకొవాలని సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ శుక్రవారం సభకు హాజరవడం ద్వారా ప్రభుత్వ పథకాల మీద అవగాహన వస్తుందని ప్రజలకు సూచించారు. ఇటు వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, జిల్లా సంక్షేమాధికారి మార్త సరస్వతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, మెడికల్‌ ప్రోగ్రాం అధికారి సన, ఐసీడీఎస్‌ సీడీపీవో కస్తూరి, తహసీల్దార్‌ అనుపమ, ఎంపీడీవో రాము, ఎంపీవో జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:41 AM