అభ్యాసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:32 AM
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస విద్యా ప్రమా ణాల పెంపుకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస విద్యా ప్రమా ణాల పెంపుకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఆయన పెద్దపల్లి మండలంలోని రాఘ వపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రాథమిక ఉపాధ్యాయులకు నిర్వ హించిన ఒకరోజు ఓరియంటేషన్ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుం చి 5వ తరగతి చదివే విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణా లు అందేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం వంటి సామర్థ్యాలు ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ డిసెంబర్ నెలలో నిర్వహించే టెస్ట్‌లో వారి ఓరల్ రీడింగ్ ఫ్రీక్వెన్సీ, రీడింగ్ కంప్రెషన్ పెంచాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:32 AM