ఆదర్శ రైతుల వ్యవస్థ పునరుద్ధరణకు కసరత్తులు
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:46 AM
గతంలో రద్దయిన ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించడానికి కసరత్తులు జ రుగుతున్నాయి. ఆదర్శ రైతులను మళ్లీ కొనసాగించాలని స ర్కారు యోచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవ హరించిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆదర్శ రైతు వ్యవస్థను బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేసింది.
- 2017లో రద్దు అయిన వ్యవస్థ
- మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటన
- విధి విదానాల రూపకల్పనలో సర్కారు
- ఏఈవోలకు తగ్గనున్న పనిభారం..
- జిల్లా వ్యాప్తంగా 355 మంది నియామకమమ్యే అవకాశం
జగిత్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గతంలో రద్దయిన ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించడానికి కసరత్తులు జ రుగుతున్నాయి. ఆదర్శ రైతులను మళ్లీ కొనసాగించాలని స ర్కారు యోచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవ హరించిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆదర్శ రైతు వ్యవస్థను బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేసింది. గతంలో రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు చేస్తూ అధిక దిగుబడి సాధిం చేలా ఆదర్శ రైతులు సాయపడేవారు. వ్యవసాయ శాఖకు, రైతు లకు అనుసంధానంగా ఉండేవారు. సాగుపై మంచి పట్టున్న వీ రు పొలాల వద్దకు వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే వారు. గతంలో అమలైన ఈ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించా లని కాంగ్రెస్ యోచిస్తోంది. తిరిగి దీన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇ టీవల వెల్లడించడం గమనార్హం. ఇందులో భాగంగా ఆదర్శ రై తు వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభు త్వం తొలి అడుగువే సింది. రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఇటీ వల జరిపిన తొలి సమావేశంలో చేసిన ప్రతిపాదనను కమి షన్ కమిటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావుకు అందజేసింది. రెవెన్యూ గ్రామాన్ని ప్రాతిపదికగా తీసు కుంటూ వెయ్యి ఎకరాలకు ఒక ఆదర్శ రైతు ఉండే విష యాన్ని ప్రతిపాదనలో స్పష్టంగా తెలిపింది.
క్లస్టర్‌కు ఐదుగురి చొప్పున...
వెయ్యి ఎకరాలకు ఒక ఆదర్శ రైతును నియమించా లని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించారు. దీని పరిధిలో రైతు వేదికను ఏర్పాటు చేయగా ఏఈవోలను నియమించారు. ఈ లెక్క న ప్రతి క్లస్టర్‌కు ఐదు నుంచి ఆదర్శ రైతులు నియమి తులయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 71 వ్యవ సాయ క్లస్టర్లు ఉన్నాయి. ఐదుగురి చొప్పున సుమారు 355 మందికి ఈ జాబితాలో చోటు దక్కనుంది.
ఏఈవోలకు తగ్గనున్న పనిభారం....
ఇటీవల కాలంలో ఏఈవోలకు పనిభారం పెరిగింది. గతంతో పోలిస్తే వారి సంఖ్య పెరిగినా వారికి ఇప్పటికే ఉన్న కార్యకలా పాలతో పాటు అదనపు పనులు అప్పగించారు. సంక్షేమ పథకా ల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించడం, ధాన్యం సేకరణలో సా యం అందించడం కర్షకులకు సలహాలు, సూచనలు ఇవ్వడం తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇటీవల డిజిటల్ సర్వే ప్రక్రియను సైతం అప్పగించా రు. దీనికి ఏఈవోలు ససేమిరా అంటూ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఆదర్శ రైతులను నియమించనుండటంతో వారికి కొంత ఉపశమనం కలుగనుంది.
ఫగతంలో ఇలా...
2007లో పదో తరగతి ఉత్తీర్ణులై సాగుపై అనుభవం ఉన్న యువకులను గు ర్తించి ఆదర్శ రైతులుగా నియమించారు. అప్పట్లో సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు వీరికి భాద్యత అప్పగించారు. 20 రకాల కార్యకలాపాలు నిర్వ ర్తించేలా నిర్దేశించారు. గౌరవ వేతనంగా ప్రతి నెలా రూ. వెయ్యి చొప్పున అంద జేశారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ వీరిని భాగస్వామ్యం చేశారు. అప్పట్లో మండలాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల కొరత ఉండటంతో రైతులకు వీరి సేవలు బాగా ఉపయోగపడ్డాయి. అయితే వివిధ కారణాలతో ఈ వ్యవస్థను ప్రభుత్వం 2017లో రద్దు చేసింది. ఆదర్శ రైతులకు రూ. 3 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పునరుద్ధరణ ఆలోచన సంతోషకరం
వాకిటి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రంలో గతంలో రద్దయిన ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణ ఆలోచన సంతోషకరం. ఆదర్శ రైతు వ్యవస్థ వల్ల బహుళ ప్రయో జనాలు అందుతాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి గణనీయం గా పెరిగే అవకాశాలున్నాయి. యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు వ్యవసాయంపై మరోమారు దృష్టి సారిస్తారు. రై తులకు అవసరమైన సలహాలు, సూచనలు వేగవంతంగా అందుతాయి. వ్యవ సాయ అధికారులపై పనిభారం సైతం తగ్గనుంది.
ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు
రాంచందర్, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ శాఖ అధికారి, జగిత్యాల
ఆదర్శ రైతుల నియామక ప్రక్రియకు సంబంధించి వ్యవసా య రంగంలో వివిధ చర్చలు చోటుచేసుకుంటున్నాయి. ఆదర్శ రై తు నియామకంలో ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలు స్తోంది. త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఇందుకు సంబందించిన ప్రక్రియ మొదలు పెడతాం. ఈ వ్యవస్థ పునరుద్దరణతో పనిభారం తగ్గి కొంత ఉపశ మనం కలుగనుంది.
Updated Date - Dec 07 , 2024 | 12:46 AM