సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:30 AM
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృదిఽ్ధ, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
- నేడు వేములవాడలో ‘రాజన్న’ దర్శనం.. బహిరంగ సభ
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- యారన్ డిపో ప్రారంభం
- గల్ఫ్ బాధితులకు ఆర్థికసాయం పంపిణీ
సిరిసిల్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృదిఽ్ధ, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపఽథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తుతో పాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని, బహిరంగ సభలో మాట్లాడతారు. సీఎం పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల మళ్లింపు చేపట్టారు. భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌లతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఉదయం హెలికాప్టర్‌లో వేములవాడకు చేరుకోని ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఇప్పటికే మంజూరైన రూ 127.65 కోట్లకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల కు అవసరమైన అధునా తన సదుపాయాలకు రూ. 76 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తారు. రూ 47.85 కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుంచి రోడ్ల వెడల్పునకు సంబం ధించిన పనులు మూల వాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ వరకు మురికి కాలువల నిర్మాణ పనులకు శంకు స్థాపనలు చేస్తారు. రూ. 50 కోట్లతో యారన్ డిపోను ప్రారంభిస్తారు. దీంతో పాటు వివిధ అభివృద్ధి పనుల ను ప్రారంభిస్తారు. 17 గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున రూ. 85 లక్షల ప్రొసీడింగ్‌లను అందజేస్తారు. రూ. 235 కోట్లతో మిడ్ మానేరు నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు రూ. 166 కోట్లతో చేపట్టే మెడికల్ కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణాలకు, రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం పనులు, రూ. 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టే హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సిరిసిల్లలో రూ 26 కోట్లతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ 1.45 కోట్లతో నిర్మించిన గ్రంఽథాల య భవనం, రూ 4.80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నా రు. 631 శివశక్తి మహిళ సంఘాలకు రూ 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేస్తారు. దేవస్థానం గుడిచెరువు మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
- భారీ బందోబస్తు...
ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1,100 మంది పోలీసు లు పటిష్ట బందోబస్తులో పాల్గొననున్నారు. బందోబస్తు కు సంబంధించి సెక్టార్‌లుగా విభజించి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులను బాధ్యులుగా నియ మించారు. బందోబస్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్య లు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఏడు చోట్ల ఏర్పాట్లు చేశారు.
- ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
ఉదయం 9.50 గంటలకు వేములవాడ దేవస్థానానికి చేరుకుంటారు.
9.55 నిముషాలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.
10గంటల నుంచి 10.15వరకు గెస్ట్‌హౌజ్‌లో ఉంటారు.
10.15 నుంచి 11 గంటల వరకు స్వామివారిని దర్శనం, ప్రత్యేక పూజలో పాల్గొంటారు.
11.15 నిముషాలకు ధర్మగుండం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
11.30 గంటలకు తిరిగి గెస్ట్‌హౌజ్‌కు చేరకుంటారు.
11.40 బహిరంగ సభ
12.30 నిముషాలకు గెస్ట్‌హౌజ్‌లో భోజనం
మధ్యాహ్నం 1 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
- పరిశీలించిన మల్టీజోన్-1 ఐజీ
వేములవాడ కల్చరల్ (ఆంధ్రజ్యోతి): వేములవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో సభాప్రాంగణాన్ని మంగళవారం మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. చెక్‌పోస్టుల ను, బారీకెడ్లను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలను అంచా నా వేసి వాటికి అనుగుణంగా పోలీసులు నడుచకోవాలని సూ చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డికి సూచించారు.
Updated Date - Nov 20 , 2024 | 12:30 AM