ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శరవేగంగా జాతీయ రహదారి పనులు

ABN, Publish Date - Jun 24 , 2024 | 01:12 AM

జాతీయ రహదారుల నిర్మాణాల పనులు ఇక పరుగులు పెట్టనున్నాయి. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల రోడ్డు విస్తరణ పనులు, జగిత్యాల-కరీంనగర్‌ రహదారి పనులకు రాజయోగం పట్టనుంది.

- మోదీ 3.0 వంద రోజుల ప్రణాళికలో రెండు రోడ్లకు చోటు

- దేశ వ్యాప్తంగా మూడువేల కిలో మీటర్ల రోడ్డు ప్రాజెక్టుల ఎంపిక

- అందులో ఆర్మూర్‌-మంచిర్యాల రోడ్డు...

జగిత్యాల-కరీంనగర్‌ రోడ్డుకు అవకాశం

- యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కేంద్రం ప్రణాళిక

- జాతీయ రహదారి 63, 563లకు రాజయోగం

- హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు

జగిత్యాల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారుల నిర్మాణాల పనులు ఇక పరుగులు పెట్టనున్నాయి. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల రోడ్డు విస్తరణ పనులు, జగిత్యాల-కరీంనగర్‌ రహదారి పనులకు రాజయోగం పట్టనుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు నుంచే మూడో సారి అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి...ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి...ఏఏ పనులు పూర్తి చేయాలి... తదితర అంశాలపై సంబంధిత అధికారులతో నరేంద్ర మోదీ సమావేశాలు, సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో ప్రధాని మోదీ మరింత దృష్టి సారించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మోదీ 3.0 మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పనులపై ఫోకస్‌ పెట్టారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు రోడ్ల ప్రాజెక్టుల పనులకు చోటు దక్కింది. దేశ వ్యాప్తంగా మొత్తం మూడువేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా... అందులో తెలంగాణ నుంచి జగిత్యాల జిల్లా నుంచి వెళ్తున్న రెండు రోడ్డు ప్రాజెక్టులకు అవకాశం కల్పించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563లకు రాజయోగం దక్కనుంది. ఈ వంద రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టు నిర్మాణ పనులు ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ సందర్బంగా ఈ పనుల్లో జాప్యం చోటుచేసుకోగా తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల పనులు మళ్లీ పట్టాలెక్కించనున్నారు.

ఫ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు...

ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల రోడ్డుకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. మరో వైపు జగిత్యాల- కరీంనగర్‌ రోడ్డు విస్తరణకు సంబంధించి సుమారు ఆరు నెలల క్రితమే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వీటికి సంబంధించి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) వేగంగా చర్యలు చేపడుతోంది. వాటిని వీలయినంతా వేగంగా పూర్తి చేసేందుకు త్వరగా పనులు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి న వాటిల్లో తెలంగాణకు సంబంధించి ఈ రెండు జాతీయ రహదారులుం డడంతో పనులు మరింత ఊపందుకోనున్నాయి.

ఫ యాక్సెస్‌ కంట్రోలు ప్రాజెక్టుగా...

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నుంచి జగిత్యాల జిల్లా మీదుగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి వరకు నిర్మించనున్న జాతీయ రహదారిని యాక్సెస్‌ కంట్రోల్‌ ప్రాజెక్టుగా విస్తరించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగ్ధల్‌పూర్‌ వరకు ఎన్‌హెచ్‌- 63ను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. లారీలు, భారీ ట్రక్కులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండే ఈ జాతీయ రహదారి రెండు వరుసలతో ఇరుకుగా ఉండి నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మెట్‌పల్లి, కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల, లక్షెట్టిపేట పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగితా ప్రాంతాల్లో రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. సుమారు 131.8 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ మార్గం అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 69.300 కిలోమీటర్లు, నిజామాబాద్‌ జిల్లాలో 30.900 కిలోమీటర్లు, మంచిర్యాల జిల్లాలో 41.813 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు నిర్వహించడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లి డివిజన్‌లో 14 కిలోమీటర్లు, కోరుట్ల డివిజన్‌లో 17 కిలోమీటర్లు, జగిత్యాల డివిజన్‌లో 38 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ జరుపనున్నారు. ఈ మార్గంలో ఆరు నుంచి 12 కిలోమీటర్ల మేర భారీ బైపాస్‌లుంటాయి. ఇవే కాకుండా సుమారు ఎనిమిది ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లను నిర్మించనున్నా రు. రహదారి క్రాసింగ్‌ల వద్ద ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మిస్తారు. ఈ మార్గంలో దాదాపు 46 వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌వోబీలు ఉంటాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 3,850 కోట్లు కాగా వ్యయం మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల వద్ద 63వ నంబరు జాతీయ రహదారి నాగ్‌పూర్‌-విజయవాడ 363 జాతీయరహదారితో అనుసంధానం కానుంది.

ఫ జగిత్యాల- కరీంనగర్‌ పనులు ఇలా..

జగిత్యాల నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారి 563లో కీలక భాగమైన జగిత్యాల-కరీంనగర్‌ 58.86 కిలోమీటర్ల పొడవు ఉన్న మరో ప్రాజెక్టును సైతం ప్రధాని నరేంద్రమోదీ 3.0 మొదటి వంద రోజుల ప్రణాళికలో చోటు కల్పించారు. ప్రస్తుతం రెండు వరసలు ఉన్న ఈ రహదారిపై ప్రమాదాలు జరుగుతుండడం, ప్రతీనిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుండడంతో విస్తరించాలని నిర్ణయించారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ మధ్య పనులు మొదలు పెట్టగా... జగిత్యాల-కరీంనగర్‌ మధ్య టెండర్ల ప్రక్రియతో ఆగిపోయింది. సదరు ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి వందరోజుల గడువులో నిర్మాణ పనులను ప్రారంభించడానికి సంబంధిత శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబందించి రూ. 1,500 కోట్లు వ్యయం అవుతుందని గతంలో అంచనా వేయగా.. ప్రస్తుతం సుమారు రెండు వేల కోట్లకు పెరుగుతోందని సంబంధితవర్గాలు అంటున్నాయి. మోదీ 3.0 తొలి వందరోజుల ప్రణాళికలో జగిత్యాల జిల్లాకు చెందిన రెండు రహదారులకు చోటు దక్కడంతో పనులు మరింత వేగవంతమవుతాయన్న ఆశతో ప్రజలున్నారు.

విస్తరణ పనులపై ప్రత్యేక ఫోకస్‌

- ధర్మపురి అర్వింద్‌, ఎంపీ, నిజామాబాద్‌

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలోని పెర్కిట్‌ నుంచి మోర్తాడ్‌, కమ్మరిపల్లి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల సమీప ప్రాంతాల నుంచి మంచిర్యాల వరకు విస్తరించనున్న జాతీయ రహదారుల పనులపై కేంద్రం ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. మోదీ 3.0 మొదటి వంద రోజుల ప్లాన్‌లో చోటు దక్కడంతో పనులు వేగవంతం కానున్నాయి. అదే విధంగా పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి వంద రోజుల ప్లాన్‌లో భాగంగా పనులు జోరందుకుంటున్నాయి.

వంద రోజుల ప్రణాళికతో వేగంగా పనులు

- పైడిపల్లి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

ప్రధాని నరేంద్రమోదీ 3.0 పాలనలో భాగంగా నిర్వహించనున్న తొలి వంద రోజుల ప్రణాళికలో జగిత్యాల-కరీంనగర్‌, ఆర్మూర్‌-జగిత్యాల- మంచిర్యాల రహదారులకు చోటు దక్కింది. దీంతో సంబంధిత రహదారుల పనులు మరింత వేగంగా జరగనున్నాయి. తెలంగాణలో చోటు కల్పించిన రెండు రహదారులు జగిత్యాల జిల్లాకు చెందినవే కావడం సంతోషకరము.

Updated Date - Jun 24 , 2024 | 01:12 AM

Advertising
Advertising