క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:05 AM
క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, ప్రతీ ఒక్కరు క్రీడలు, వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ అన్నారు.
కరీంనగర్ స్పోర్ట్స్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని, ప్రతీ ఒక్కరు క్రీడలు, వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో బీసీ వసతి గృహాల విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలన్నారు. అనంతరం ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, డీవైఎస్‌వో బి శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్‌కుమార్, ఏవో, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అంతడ్పుల శ్రీనివాస్, వాలీబాల్ సంఘం జిల్లా కార్యదర్శి గిన్నె లక్ష్మణ్ పాల్గొన్నారు.
Updated Date - Nov 17 , 2024 | 12:05 AM