ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భవిష్యత్‌లో ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:44 AM

ప్రకృతి విపత్తులు సంబవిం చినపుడు భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుం డా పటిష్ట నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వ విప్‌ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

లింగాపూర్‌ చెరువును పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పెగడపల్లి, సెప్టెంబరు 4: ప్రకృతి విపత్తులు సంబవిం చినపుడు భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుం డా పటిష్ట నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వ విప్‌ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని లింగాపూర్‌ పెద్ద చెరువుకు మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తును వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌ అధికారులు, స్థానిక నాయకులతో కలసి బుధవా రం సందర్శించి పరిశీలించారు. అనంతరం శాలపల్లి అడుపపల్లి గ్రామాల మద్యన లోలెవల్‌ బ్రిడ్జి పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటి ఉధృతిని పరిశీలిం చారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి చెరువు కట్ట మరమ్మతు, హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణాలకు ప్రతిపాద నలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో లింగాపూర్‌, శాలపల్లి గ్రా మాల ప్రజలతో పాటు మండల ప్రజలు రాకపోకలు నిలి చిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. భవిష్యత్‌లో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా బ్రిడ్జిలు, కల్వర్టులు, చెరువు కట్టలు, తూముల నిర్మాణాలకు నిధులు మం జూరు చేయించి నిర్మాణ పనులు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చా రు. లింగాపూర్‌ చెరువుతో పాటు మండలంలోని చెరువుల కట్టలు, తూ ములు, మత్తడి నిర్మాణాలు చేసి సాగు నీరు వృదా కాకుండా రైతాంగా నికి ఉపయోగపడేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో సందర్భంగా ఎంపీడీవో శ్రీని వాస్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, గిర్దావర్‌ శ్రీనివాస్‌, పార్టీ నాయకులు రాములుగౌడ్‌, ఒరు గల శ్రీనివాస్‌, పూసాల శోభాతిరుపతి, కురిక్యాల శేఖర్‌, రాంచంద్రం, విజయభాస్కర్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:44 AM

Advertising
Advertising