ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గీట్ల ముకుందరెడ్డి సేవలు మరువలేనివి

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:29 AM

మాజీ ఎమ్మెల్యే, దివంగత గీట్ల ముకుందరెడ్డి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 19: మాజీ ఎమ్మెల్యే, దివంగత గీట్ల ముకుందరెడ్డి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్ర వారం మండలంలోని గీట్ల ముకుందరెడ్డి స్వగ్రామమైన కూనారం గ్రామంలో ము కుందరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తో పాటు గీట్ల ముకుందరెడ్డి కుమారుడు గిట్ల రాజేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, గీట్ల అభిమానులు పాల్గొని ముకుందరెడ్డి ఘాటు వద్ద పూ లమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు మాట్లాడుతూ గీట్ల ముకుందరెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పు డు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కునారం గ్రామ సర్పంచ్‌గా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం సమితి ప్రెసిడెంట్‌గా, మూడుసార్లు పెద్దపెల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలం దించారన్నారు. ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో లేకపోవడం బాధాకరమ న్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. దివంగత ముకుందరెడ్డి బాటలో నడిచి నియోజకవర్గాన్ని అన్ని విధానాల అభివృద్ధి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీట్ల రాజేందర్‌ రెడ్డి, ఎంపీపీ నూనేటి సంపత్‌, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గాజనవేన సదయ్య, ఎంపీటీసీ కొల్లూరి రమరాయ మల్లు, మాజీ సర్పంచ్‌ డొంకెన విజయమొగిలి, నాయకులు పులి ఇంద్రకరణ్‌రెడ్డి, తులా మనోహర్‌రావు, మునీర్‌, కొమరయ్య, సజ్జు, రమేష్‌, అల్లం సతీష్‌, గిస రాజు, శివరామకృష్ణ, అశోక్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:29 AM

Advertising
Advertising