ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘పది’ ఫలితాల్లో బాలికలదే పైచేయి..

ABN, Publish Date - May 01 , 2024 | 12:44 AM

పదో తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు.

పెద్దపల్లి కల్చరల్‌,ఏప్రిల్‌ 30 : పదో తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. రాష్ట్రస్థా యిలో పెద్దపల్లి జిల్లా 96.32 శాతంతో ఎనిమిదవ స్థానం లో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 120 కేంద్రాల్లో 7716 మంది విద్యార్థులు పరీక్షలకు రాయగా, 7432 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా బా లురు 1769 పరీక్షలు రాయగా 1567 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 1893 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 1839 మంది విద్యార్థినిలు ఉత్తీర్ణులు అ య్యారు. దీనితో బాలికలు 97.45 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 95.2 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆరుగురు 10 జీపీఏ సాధించారు. జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాల జూలపల్లి ఇద్దరు, టీఎంఎస్‌ లింగాపూర్‌ ఇద్దరు, కేజీబీవీ రామగిరి ఒకరు, జడ్పీ హెచ్‌ఎస్‌ గర్ల్స్‌ పెద్దపల్లి ఒకరు 10జీపీఏ సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యా ర్థులను జిల్లా విద్యాధికారి మాధవి, జిల్లా పరీక్షల నిర్వ హణ అధికారి రాంరెడ్డి అభినందించారు. ఇక ప్రైవేటు పాఠశాలలు కూడా తమ సత్తాను చాటుకున్నాయి.

మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 99 శాతం ఉత్తీర్ణత

పదవ తరగతి ఫలితాలలో జిల్లాలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 99శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్‌ మేరాజ్‌ మహ్ముద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 3 మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి 10వ తరగతి పరీక్షలు రాసిన 129 మంది విద్యార్థులలో 128 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఒక విద్యార్థి మాత్రమే ఫెయిల్‌ కాగా, 99శాతం ఉత్తీర్ణత సాధించడంలో కృషిచేసిన ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బందికి, సహకరించిన ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - May 01 , 2024 | 12:44 AM

Advertising
Advertising