ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Oct 31 , 2024 | 11:53 AM

కరీంనగర్‌లోని మల్టీపర్పస్‌ పార్కు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆరు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో పార్కు పనులు చేపడుతున్నారు. నవంబరులో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు తెలిపారు.

కరీంనగర్: వాసులకు గుడ్ న్యూస్ (Good News).. నగరంలో మల్టీపర్పస్ పార్క్ (Multipurpose Park) త్వరలోనే అందుబాటులోకి రానుంది. సిటీ నడిబొడ్డున ఉన్న ఈ పార్కులో మ్యూజికల్ ఫౌంటైన్ (Musical Fountain) హైలెట్‌గా నిలవనుంది. రాత్రి వేళల్లో సౌండ్ చేస్తూ.. మిరిమిట్లు గొలిపే ఫౌంటైన్ ట్రయల్‌రన్ కూడా సక్సెస్ అయింది. కరీంనగర్ పట్టణంలోని మల్టీపర్పస్ పార్క్ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్మార్ట్ సిటీలో ఆరెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో పార్కు పనులను చేపడుతున్నారు. సాయంత్రం వేళ కొత్తదనం కోరుకునే ఉద్యోగులకు, నగర వాసులు ఒక అద్భుతమైన వాతావరణంలో కుటుంబసభ్యులతో గడిపేలా ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. నగరం నడిమధ్యలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ పార్క్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


కాగా కరీంనగర్‌లోని మల్టీపర్పస్‌ పార్కు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆరు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో పార్కు పనులు చేపడుతున్నారు. నవంబరులో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన పార్కులో పనులను పర్యవేక్షించి మ్యూజికల్‌ వాటర్‌ ఫౌంటేన్‌ ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. రంగురంగులతో మిరిమిట్లు కొల్పడమే కాకుండా చక్కటి మ్యూజిక్‌తో ఏర్పాటు చేసిన వాటర్‌ పౌంటన్‌ ట్రయల్‌ రన్‌ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు అందమైన ఆహ్లాదకరమైన పార్కును అందించాలనే లక్ష్యంతో మల్టీపర్పస్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పార్కు పనులతోపాటు చారిత్రక కట్టడమైన ఓల్డ్‌ హైస్కూల్‌ భవనాన్ని ఆధునీకరించి కలరింగ్‌, లైటింగ్‌ సిస్టమ్‌తో చారిత్రక చిహ్నంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పార్కుకు వచ్చే సందర్శకుల కోసం ఫుడ్‌ స్టాల్స్‌, వాహనాల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేస్తున్నామని, పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. నవం బరులో పార్కును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మీడియాకు ఎప్పుడో తాళాలు పడేవి ..

అట్టహాసంగా నరకాసుర వధ

తెలంగాణలో మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌..

జగన్ అనుసరిస్తున్న విధానం ఇదీ..

దీపావళికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 31 , 2024 | 11:54 AM