కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:12 AM
రైతులు పండిం చిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు.
గోదావరిఖని, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రైతులు పండిం చిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. శనివారం రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్ జనగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అని, ఎలాంటి కోత లేకుండా మద్దతు ధర కల్పిస్తామని భరసా ఇచ్చారు. దళారులను నమ్మి రైతులు మోస పోవద్దని, ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500బోనస్ కూడా ఇస్తున్నట్టు చెప్పారు. కొంత మంది ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. తడిచి మొల కెత్తిన ధాన్యం వేరుగా ఉంచాలని, మిల్లర్లతో మాట్లాడి వాటికి మద్దతు ధరతో కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, నాయకు లు పాతిపెల్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, జువ్వాడి మాధవరావు, విజ య్‌రావు, రుద్రభట్ల నారాయణ, కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Nov 17 , 2024 | 12:12 AM