భక్తిశ్రద్ధలతో గురునానక్ జయంతి
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:15 AM
జిల్లా కేంద్రంలోని గురుద్వారాలో శుక్రవారం గురునానక్ దేవ్‌జీ మహారాజ్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని గురుద్వారాలో శుక్రవారం గురునానక్ దేవ్‌జీ మహారాజ్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొన్ని రోజులుగా గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో గురువాణి, ప్రత్యేక కీర్తనలు, నగర వీధులగుండా ప్రభాత్‌ఫేరి నిర్వహించారు. జయంతి సందర్భంగా శుక్రవారం సిక్కు మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు ఆలపించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు వేర్వేరు సమయాల్లో హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సర్దుల్‌సింగ్, కిషన్‌సింగ్‌తో పాటు రణబీర్‌సింగ్, బల్‌బీర్‌సింగ్, సిక్కు మతస్తులు పాల్గొన్నారు. ఫార్చూన్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఫకరీంనగర్ అర్బన్: నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సర్దార్ ధన్నాసింగ్ ఆహ్వానం మేరకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కరీంనగర్‌లోని గురుద్వారాను సందర్శించారు. ఈసందర్భంగా సిక్కు మత గురువులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
Updated Date - Nov 16 , 2024 | 12:15 AM