ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది..

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:21 AM

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుందని, మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

రామడుగు, జూలై 26: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుందని, మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మండలంలోని వెదిర ప్రభుత్వ పాఠశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రాల్లో సభ నిర్వహిస్తున్నామని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. గర్భిణీలు, మహిళలు ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర సమస్యలపై చర్చించే అవకాశం ఉందన్నారు. ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాల్లో మహిళలందరికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, డీఆర్డీవో శ్రీధర్‌, బీసీడీవో అనిల్‌ ప్రకాష్‌, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్‌వో సుజాత, తహసీల్దార్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:21 AM

Advertising
Advertising
<