ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రామగుండం అభివృద్ధికి భారీగా నిధులు

ABN, Publish Date - Jun 24 , 2024 | 12:40 AM

రామగుండం నియోజకవర్గాన్ని ప్రణాళికబద్ధంగా అభివృ ద్ధి చేస్తున్నామని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి భారీగానిధులు విడుదలయ్యాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

గోదావరిఖని, జూన్‌ 23: రామగుండం నియోజకవర్గాన్ని ప్రణాళికబద్ధంగా అభివృ ద్ధి చేస్తున్నామని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి భారీగానిధులు విడుదలయ్యాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతం లో పాలకుల నిర్లక్ష్యం వల్ల రామగుండం అభివృద్ధికి నోచుకోలేదని, కేసీఆర్‌, కేటీఆర్‌ లు నిధులు మంజూరు ప్రకటించారే తప్ప విడుదల చేయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో రూ.100కోట్ల టీయూఎఫ్‌ఐడీ నుంచి నిధులు విడుదల చేయించామని, ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పిలి చారన్నారు. రూ.30కోట్లతో గోదావరిఖనిలో ని వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్‌లో అభివృ ద్ధి పనులు చేపడుతున్నామని, 50డివిజన్ల లో ఇంటర్నల్‌ రోడ్లకు రూ.20కోట్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ.10కోట్లు కేటా యించామన్నారు. వరదల నివారణకు పారి శుధ్య చర్యలు మెరుగుపర్చడంలో భాగంగా పెద్ద నాలాలను ఆధునికీకరించేందుకు రూ.10కోట్లు కేటాయించామన్నారు. రామ గుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పూర్తిస్థాయిలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం రూ.10కోట్లు కేటాయించామన్నారు. రూ.5కోట్లు మంచి నీటి సరఫరాకు కేటాయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభి వృద్ధికి సరైన ప్రణాళికలు వేయలేదని, కూడళ్లను విస్తరించకుండా నిర్మాణాలు జరి పారన్నారు. రూ.2కోట్లతో కీలకమైన పాంతా ల్లో జంక్షన్లను అభివృద్ధి చేస్తామన్నారు. పండ్ల మార్కెట్‌కు గతంలో కొబ్బరికాయలు కొట్టారని, సింగరేణి నుంచి స్థలం తీసుకో కుండానే ఈ పనులు చేశారన్నారు. రూ.4 కోట్లతో పండ్ల మార్కెట్‌ను అభివృద్ధి చేస్తా మన్నారు. రూ.250కోట్ల అమృత్‌ నిధులతో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, డ్రైనేజీ లైన్లు నిర్మించనున్నామన్నారు. రామగుండం, పా ములపేట, మల్కాపూర్‌, జనగామ, యైుటిం క్లయిన్‌కాలనీ ప్రాంతాల్లో ఎస్‌టీపీలు నిర్మిం చి మురుగు నీరు గోదావరిలో కలువకుం డా చర్యలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిం దని, త్వరలోనే పనులు ప్రారంభమవుతా యన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో సింగరే ణి, ఎన్‌టీపీసీలను భాగస్వామ్యం చేస్తామ న్నారు. రూ.13కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు జరుగుతుందని, గుండె జబ్బుల చికిత్స, సర్జరీలు కూడా ఇక్కడే చేసేలా చర్యలు చేపడుతామన్నారు. ఈ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకే కాకుండా ఇతర పౌరులకు కూడా సేవలందుతాయ న్నారు. సింగరేణి కాలనీల్లో రూ.5కోట్లతో అంతర్గత రహదారుల నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. రూ.22కోట్లతో ర్యాపిడ్‌ ఫిల్టర్‌ స్కీమ్‌ పురోగతిలో ఉందని, 10నెల ల్లో అందుబాటులో ఉంటుందన్నారు. రూ. 22కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులు, రూ.10కోట్ల స్పెషల్‌ ఫండ్‌ వెచ్చించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణి, ఎన్‌టీపీసీ సంస్థలకు అవసరమయ్యే విడి భాగాలు, పనిముట్ల సరఫరాకు అనుబంధ పరిశ్రమలను ప్రోత్స హిస్తామన్నారు. ఎన్‌టీపీసీ బూడిదతో బ్రిక్స్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకువస్తే అంత ర్గాం సమీపంలో స్థలాలు కూడా ఇప్పించ నున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్‌టీపీసీ అదనపు యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు భారమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి కనబర్చడం లేదని, ఈ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా, ఇక్కడి ప్రజల ఉపాధి దృష్ట్యా త్వర లోనే యూనిట్ల నిర్మాణానికి క్లియరెన్స్‌ ఇప్పించనున్నామన్నారు. రామగుండం పట్ట ణంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం జరుగ నున్నదని, ఈ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. సింగరేణి, జెన్‌కో స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి త్వరలోనే పట్టాలు ఇవ్వనున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఈ కార్యక్ర మం నిర్వహిస్తామన్నారు. సికింద్రాబాద్‌ - కాగజ్‌నగర్‌ రూట్‌లో తరచూ రైళ్లను రద్దు చేయడంపై రైల్వే అధికారుల దృష్టికి తీసు కెళ్లామని, ఎంపీ ద్వారా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. విలేకరుల సమావేశం లో నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, బాల రాజ్‌కుమార్‌, దాతు శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు కాల్వ లింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, దీటి బాలరాజు, బొమ్మక రాజేష్‌, పెండ్యాల మహేష్‌, తిప్పారపు శ్రీనివాస్‌, నాజీమో ద్దీన్‌, కౌటం సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 12:40 AM

Advertising
Advertising