ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:37 AM

రామగుండం నియోజనకవర్గంలో బీ ఆర్‌ఎస్‌ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆరోపించారు.

గోదావరిఖని, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజనకవర్గంలో బీ ఆర్‌ఎస్‌ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆరోపించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష పార్టీగా నిర సన కార్యక్రమాలు చేపడితే ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ప్రోత్సాహంతో తమను పోలీసు లు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని, కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అంతర్గాం ఎస్‌ఐ తమ నిరసనను అడ్డుకోవడమే కాకుండా పార్టీ మారాలంటే తమ పార్టీ నాయకులను బెదిరిస్తున్నాడన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ కార్పొరేషన్‌ కార్యాల యంలో నిరసన తెలిపితే మహిళా కార్పొరేటర్లపై సైతం కేసులు నమోదు చేశారని, పోలీస్‌ స్టేషన్లకు వెళితే సీఐ దుర్భాషలాడారన్నారు. ఎన్‌టీపీసీలో ప్రజలు ట్రస్ట్‌గా ఏర్పడి ఆలయ నిర్మాణానికి పూనుకుంటే ఒక వ్యక్తి అడ్డుకోవడమే కాకుండా డిప్యూ టీ మేయర్‌, అతని తండ్రిపై పెట్రోల్‌ పోశారని, అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా కాపాడుతున్నారన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఏసీపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల వరకు వెళతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు జనగామ కవిత, మాజీ జడ్‌పీటీసీ ఆముల నారాయణ, నాయకులు బొడ్డు రవీందర్‌, సంధ్యారెడ్డి, తోకల రమేష్‌, సట్టు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:37 AM