ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీల్లో మహిళా ఓటర్లే అధికం

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:02 AM

పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియగా మరో ఎన్నికల పండగకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల పదవీ కాలం ఈ యేడాది జనవరి 31వ తేదీతో ముగి యగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇప్పటికే జీపీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో ప్రభుత్వం వాయిదా వేసింది.

జగిత్యాల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియగా మరో ఎన్నికల పండగకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల పదవీ కాలం ఈ యేడాది జనవరి 31వ తేదీతో ముగి యగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇప్పటికే జీపీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో ప్రభుత్వం వాయిదా వేసింది. రెండు నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఓటరు జాబితా సిద్థం చే యాలని, బీసీ కమిషన్‌ సైతం నివేదికతో సిద్ధంగా ఉండాలని సూచిం చారు. ఆ దిశగా కసరత్తు ప్రారంభించిన అధికారులు మండలాలు, జీపీ లు, వార్డుల వారీగా ఓటరు జాబితాను సిధ్దం చేశారు. నాలుగు రోజుల క్రితం అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం ముగియగా త్వరలో మున్సిపా లిటీల పదవీకాలం కూడా ముగియనుంది. ఇక వరుస ఎన్నికలు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పంచాయతీ పోరుపై త్వరలో స్పష్టత రానుంది.

ఆమే న్యాయ నిర్ణేత...

పంచాయతీ ఓటరు లిస్టులో మహిళలే అగ్రభాగంలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,93,540 మంది ఓటర్లుండగా ఇందులో మహిళలు 3,10,522 మంది, పురుషులు 2,83,000 మంది, ఇతరులు 8 మంది ఓటర్లున్నారు. అన్ని మండలాలు, పంచాయతీల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా మహిళలు మేడిపల్లి మండలంలో 21,846 మంది ఉండగా అత్యల్పంగా జగిత్యాల అర్బన్‌ మండలంలో 4,983 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అతివల ఆశీస్సులు ఎవరికి అందితే వారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మండలాల వారీగా ఓటర్లు ఇలా..

జిల్లాలోని బీర్‌పూర్‌ మండలంలో 8272 మంది పురుషులు, 9072 మంది స్ర్తీలు, మొత్తం 17,344 మంది ఓటర్లున్నారు. అదేవిదంగా బు గ్గారంలో 8,794 మంది పురుషులు, 9,252 మంది స్ర్తీలు, మొత్తం 18,046 మంది, దర్మపురిలో 16,848 మంది పురుషులు, 17,875 మంది స్ర్తీలు, మొత్తం 34,723 మంది, గొల్లపల్లిలో 18,732 మంది పురుషులు, 20,104 మంది స్త్రీలు, మొత్తం 38,837 మంది, ఇబ్రహీంపట్నంలో 14,296 మంది పురుషులు, 16,566 మంది స్త్రీలు, మొత్తం 30,862 మంది ఉన్నారు. జగి త్యాల రూరల్‌లో 21,449 మంది స్ర్తీలు, 23,481 మంది పురుషులు, ఇత రులు ఇద్దరు, మొత్తం 44,882 మంది ఉన్నారు. జగిత్యాలలో 4,476 మం ది పురుషులు, 4,983 మంది స్ర్తీలు, మొత్తం 9459 మంది ఉన్నారు. క థలాపుర్‌లో 17,430 మంది పురుషులు, 19,545 మంది స్ర్తీలు, మొత్తం 36,975 మంది, కొడిమ్యాలలో 18,468 మంది పురుషులు, 19,626 మంది స్త్రీలు, మొత్తం 38,094 మంది, కోరుట్లలో 14,579 మంది పురుషులు, 16,259 మంది స్ర్తీలు, మొత్తం 30,838 మంది, మల్యాలలో 18,733 మంది పురుషులు, 20,713 మంది స్త్రీలు, మొత్తం 39,448 మంది, మల్లాపూర్‌లో 19,007 మంది పురుషులు, 21,509 మంది స్ర్తీలు, మొత్తం 40,516 మంది, మేడిపల్లిలో 19,387 మంది పురుషులు, 21,846 మంది స్ర్తీలు, ఇతరులు 1, మొత్తం 41,234 మంది, మెట్‌పల్లిలో 16,967 మంది పురుషులు, 19, 250 మంది స్త్రీలు, ఇతరులు ఒకరు, మొత్తం 36,218 మంది, పెగడపల్లి లో పురుషులు 17,080 మంది, స్త్రీలు 18,182 మంది, మొత్తం 35,262 మంది, రాయకల్‌లో 18,314 పురుషులు, 20603 మంది స్త్రీలు, ఇతరులు ఒకరున్నారు. మొత్తం 38,918 మంది ఉన్నారు. సారంగపూర్‌లో 9,572 మంది పురుషులు, 10,456 మంది స్ర్తీలు, మొత్తం 20,028 మంది, వె ల్గటూర్‌లో 20,606 మంది పురుషులు, 21,200 మంది స్త్రీలు మొత్తం 41,806 మంది ఓటర్లు ఉన్నారు.

జిల్లాలో 382 పంచాయతీలు, 3,512 వార్డులు..

జిల్లాలో 382 పంచాయతీలు, 3,512 వార్డులున్నాయి. ఇందులో బీర్‌ పూర్‌ మండలంలో 17 గ్రామాలు, 136 వార్డులు, బుగ్గారంలో 11 గ్రామా లు, 104 వార్డులు, ధర్మపురిలో 25 గ్రామాలు, 246 వార్డులు, గొల్లపల్లిలో 27 గ్రామాలు, 246 వార్డులు, ఇబ్రహీంపట్నంలో 17 గ్రామాలు, 162 వా ర్డులు, జగిత్యాల రూరల్‌లో 29 గ్రామాలు, 268 వార్డులున్నాయి. అదే విధంగా జగిత్యాలలో 5 గ్రామాలు, 50 వార్డులు, కథలాపూర్‌లో 19 గ్రా మాలు, 188 వార్డులు, కొడిమ్యాలలో 24 గ్రామాలు, 216 వార్డులు, కోరు ట్లలో 15 గ్రామాలు, 152 వార్డులు, మల్యాలలో 19 గ్రామాలు, 186 వా ర్డులున్నాయి. మల్లాపూర్‌లో 23 గ్రామాలు, 220 వార్డులు, మేడిపల్లిలో 25 గ్రామాలు, 238 వార్డులు, మెట్‌పల్లిలో 23 గ్రామాలు, 212 వార్డులు, పెగ డపల్లిలో 23 గ్రామాలు, 216 వార్డులు, రాయికల్‌లో 32 గ్రామాలు, 276 వార్డులు, సారంగపూర్‌లో 18 గ్రామాలు, 144 వార్డులు, వెల్గటూర్‌లో 30 గ్రామాలు, 274 వార్డులున్నాయి.

బిజీ బిజీగా అధికారులు..

జిల్లాలో గ్రామపంచాయతీల వారీగా అధికారులు పలు వివరాలు సే కరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపిక చేసిన పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా ఎన్ని అవసరం అవుతాయి. అనే విషయాన్ని గ్రామా ల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఒ క్కో గ్రామంలో రెండు నుంచి నాలుగు పోలింగ్‌ బూతులు ఏర్పాటు చే యగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా బూతులు ఏ ర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని పోలింగ్‌ స్టేషన్లు, ఎం త మంది సిబ్బంది అవసరం, చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఓటర్లను సైతం వార్డుల వారీ గా విభజించి ఎన్ని బూతులు అవసరమనే విషయంపై కసరత్తు చేస్తున్నారు.

పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు...

వందశాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలను గతంలో ఆ సామా జిక వర్గానికే రిజర్వు చేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరిగిందనే వా దన తెరపైకి వచ్చింది. దీంతో బీసీ కమిషన్‌ను నివేదిక కోరింది. జిల్లాలో ప్రతి వార్డులో పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. వార్డు సభ్యు డిగా పోటీ చేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ గ్రూపులు, వర్గాలను కూడకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీలక తీతంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నప్పటికీ ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు పోటీకి ఆ సక్తి చూపుతున్నారు. సర్పంచ్‌ పదవిపై సైతం పలువురు నేతలు కన్నేసి ముం దస్తుగా పావులు కదుపుతున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 01:02 AM