స్ట్రక్చర్ మీటింగ్‌లో కార్మికుల సమస్యలను చర్చిస్తాం
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:57 AM
కొత్తగూడెంలో ఈనెల 28న జరిగే సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో కార్మిక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ చెప్పారు.
గోదావరిఖని, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కొత్తగూడెంలో ఈనెల 28న జరిగే సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో కార్మిక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ చెప్పారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై చర్చించి అగ్రిమెంట్లు చేసుకునే పద్ధతిలో జరుగాల్సిన స్ట్రక్చర్ చైర్మన్, డైరెక్టర్ లెవల్ సమా వేశాలు జరుగకపోవడం వల్ల కార్మికుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సింగరేణిలో వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించడం, మారు పేర్లు ఉన్న కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, మైనింగ్, ట్రేడ్‌మెన్స్, ఈపీ ఆపరే టర్లు మెడకల్ అన్‌ఫిట్ అయితే సుటబుల్ జాబ్ ఇవ్వాలని, అలవె న్సులు ఇవ్వాలని, ఇన్సెంటివ్ ఇవ్వాలని తదితర సమస్యలపై యాజ మాన్యంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కొన్ని సంఘాలు ఏఐటీయూసీని బదనాం చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయని, మెంబర్‌షిప్ రికవరీ విషయంలో కార్మికుల్లో అల జడి సృష్టిస్తున్నారని, దీనిపై యజమాన్యం తమ అభిప్రాయాన్ని తెల పాలని నోటీసు జారీ చేసినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, ఆరెల్లి పోషం, కవిత, మద్దెల దినేష్, ఎంఏ గౌస్, దాసరి శ్రీనివాస్, గొడిశెల నరేష్, బుర్ర భాస్కర్, మొగిలి, మల్లేష్, తొడుపునూరి రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:58 AM