బీమా సొమ్ముపై పెరుగుతున్న ఆశలు
ABN, Publish Date - Nov 09 , 2024 | 01:15 AM
స్వయం స హాయక సంఘాల మహిళా సభ్యులకు బీమా సొమ్ము పై ఆశలు పెరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు బీమా సొమ్ము చెల్లింపునకు అధికారులు కసరత్తులు చేస్తుండ డంతో అర్హులైన మహిళలకు అందుతుందన్న ఆశతో ఎ దురుచూస్తున్నారు.
- ఈనెలాఖరులోపు చెల్లించేందుకు కసరత్తులు
- మహిళా సంఘాల సభ్యులకు సురక్ష పథకం కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు
- మార్చి నుంచి ఇప్పటివరకు మృతుల వివరాల సేకరణపై దృష్టి
- ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షలు
- సాధారణ మరణం పొందితే రూ. 2 లక్షలు
- 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళలే అర్హులు
జగిత్యాల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్వయం స హాయక సంఘాల మహిళా సభ్యులకు బీమా సొమ్ము పై ఆశలు పెరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు బీమా సొమ్ము చెల్లింపునకు అధికారులు కసరత్తులు చేస్తుండ డంతో అర్హులైన మహిళలకు అందుతుందన్న ఆశతో ఎ దురుచూస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభు త్వం బ్యాంకు లింకేజీ రుణాలిస్తూ ఆర్థికంగా ఎదిగేందు కు అవకాశాలిస్తోంది. తాజాగా బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి ఆపత్కాలంలో బాధిత కుటుంబానికి మేలు చేయా లని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఎందరు మృతి చెందారో వివరాలు సెర్ఫ్, స్త్రీ నిధి, మెప్మా అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులో గా నీ, వచ్చే నెలలో గానీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు బీమా చెక్కులు ఇవ్వనున్నారు.
జిల్లాలో మహిళా సంఘాల సంఖ్య..
జిల్లా వ్యాప్తంగా సెర్ఫ్ ఆధ్వర్యంలో 14,964 స్వయం సహాయక మహిళా సంఘాలున్నాయి. ఇందులో 1,73,412 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అదేవి ధంగా జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో 5,451 స్వయం సహాయక మహిళా సంఘాలుండగా, ఇందులో 58,007 మహిళా సభ్యులున్నారు.
సభ్యురాలు మృతి చెందితే...
మహిళా సంఘంలో సభ్యురాలు ఎవరైనా ప్రమాదం లో మృతి చెందితే ఆ కుటుంబానికి రూ. 10 లక్షల బీ మా అందజేయనుంది. సంఘం సభ్యుల్లో ఏ ఒక్కరూ చె ల్లించకున్నా మిగితా వారికి కొత్త రుణం రాదు. ఎవరై నా సభ్యురాలు మృతి చెందితే మిగితా సభ్యులు వాయి దాలు చెల్లించాలని ఆ కుటుంబంపై గతంలో ఒత్తిడి తె చ్చేవారు. ఇప్పుడు ప్రమాద బీమా నుంచే చెల్లించే వె సులుబాటు కల్పించారు. వాయిదా డబ్బులు పట్టుకుని మిగితాది ఆ కుటుంబానికి అందజేస్తారు. బకాయిలు లే కుంటే మొత్తం సొమ్ము ఇస్తారు. మహిళా సంఘం స భ్యురాలు సాధారణ మరణం పొందితే ఆ కుటుంబానికి రూ. 2 లక్షల బీమా వస్తుంది. బకాయి ఉంటే అవి పట్టు కొని మిగితాది కుటుంబ సభ్యులకు ఇస్తారు. అదేవిధం గా సంఘం సభ్యులకు సురక్ష పథకం కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.
గ్రామీణ, మున్సిపాలిటీల పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి. వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. సభ్యురాలు చనిపోతే ఆ సమాచారం గ్రా మం, పట్టణాల్లోని ఐకేపీ, మెప్మా సిబ్బందికి తెలియజేయాలి. సభ్యురాలి వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలు స్త్రీనిధి సహాయ మే నేజర్‌కు, అక్కడి నుంచి జనరల్ మేనేజర్‌కు వెళ్తాయి. మరణ ధ్రువీ కరణ పత్రం, సంఘం సభ్యురాలి వివరాలు సరిగా ఉన్నాయో లేదో జీఎం పరిశీలించి బీమా సొమ్ము మంజూ రు చేస్తారు. ఇప్పటికే ఐకేపీ, స్త్రీ నిధి అధికారులు, సి బ్బందికి దీనిపై శిక్షణ ఇచ్చారు.
నెలాఖరులోపు చెల్లించేందుకు కసరత్తులు...
స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు బీమా సొమ్ము చెల్లింపునకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుత యేడాది మార్చి నుంచి ఇప్ప టివర కు ప్రమాదవశాత్తు గానీ, సాధారణంగా గానీ మరణించిన మహిళా సంఘలా సభ్యుల వివరాలను ఐకేపీ, మెప్మా సిబ్బంది సేకరిస్తున్నారు. వివరాలు, ఫొటోలు ఆన్ లైన్‌లో నమోదు చేస్తున్నారు. మున్ముందు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈనెలాఖరులోపు బీమా సొమ్ము చెల్లింపు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాము
భూకైలాస్, స్త్రీ నిధి, జిల్లా మేనేజర్
జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు బీమా సొమ్ము చె ల్లింపునకు అవసరమైన కసరత్తులు చేస్తున్నాము. ప్రస్తుతం అర్హులైన మహిళ లు, సంబంధిత కుటుంబాల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు న మోదు చేస్తున్నాము. ప్రభుత్వం మున్ముందు తీసుకునే నిర్ణయం మేరకు బీమా సొమ్ము పనులను పూర్తి చేస్తాము.
Updated Date - Nov 09 , 2024 | 01:15 AM