ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:52 AM
కార్తీక పౌర్ణమి వేడుకలను శుక్రవారం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
సుల్తానాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి వేడుకలను శుక్రవారం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో అభిషేకా లు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణ ల్లోని తులసి, ఉసిరి, రావి, తదితర వృక్షాల కింద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. స్థాని క సాంబశివ దేవాలయంలో జ్వాలాతోరణం వెలి గించారు. ఇంటింటా సత్యనారాయణ స్వామి నో ములు, వ్రతాలను నోచుకున్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో దీపొత్సవం నిర్వహించారు. అలాగే సాంబశివ ఆలయాల అవరణల్లో పెద్దఎ త్తున దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు. గ్రం థాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ సమతక్రిష్ణ, ఆలయ చైర్మన్ పల్లా మురళి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్ (ఆంధ్రజ్యోతి) : పెద్దపల్లి మండలం రాగినేడు స్వయంభు శ్రీనాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజాకార్యక్రమాల ను నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 54 పార్థివ లింగాలకు పూజలు, 20 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వా మి వ్రతాలు, గోమాత పూజ, రుద్రాభిషేకాలు, తు లసి కల్యాణం, దీపోత్సహం నిర్వహించారు. దేవా లయ కమిటీ చైర్మన్ పోతురాజుల భూమయ్య, పడాల తిరుపతి, దేశగిరిరావు, పడాల భూమ య్య,పడాల సత్యనారాయణ, రఘుపతిరావు, శ్రీధ ర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.కాగా, నాగ లింగేశ్వర ఆల యానికి వచ్చే భక్తులకు దాహర్తిని తీర్చేందుకు బ్రాహ్మణపల్లికి చెందిన మ్యాకల సర స్వతి-రాజేశం దంపతులు సుమారు 50వేల విలు వగల వాటర్‌ప్లాంట్‌ను అందించారు. ఆలయ క మిటీ సభ్యులు వారిని సత్కరించారు.
కోల్‌సిటీటౌన్(ఆంధ్రజ్యోతి):గోదావరిఖనిలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. కోదండ రామాలయంలోని శివాలయంలో అభిషే కాలు, ప్రత్యేకపూజలు జరిగాయి. భక్తులకు ఇబ్బం దులు కలగకుండా ఆలయ ఈఓ, సిబ్బంది ఏర్పా ట్లు చేశారు. సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్ర మం నిర్వహించారు. అలాగే జనగామలోని శివాల యం, పవర్‌హౌస్‌కాలనీ, మార్కండేయకాలనీలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
యైుటింక్లయిన్‌కాలనీ (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సంతోషిమాత ఆల యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాణి రుద్ర మదేవి సెంటర్ నుంచి 108 కిలోల ఓడి బియ్యం, 108 దీపాలతో ఆలయం వరకు మహిళలు శోభా యాత్ర నిర్వహించారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా 108రకాల అభిషేకాలు నిర్వహించారు. వెంకటేశ్వ రస్వామి, హనుమాన్, విశ్వకర్మ ఆలయాల్లో ప్రత్యే క పూజలు జరిగాయి. సంతోషిమాత ఆలయంలో జరిగిన పూజల్లో బీజేపీ రామగుండం ఇంచార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:52 AM