తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి కేసీఆర్
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:57 PM
తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్తబస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్‌ఎస్ ప్రజాప్రతి నిధులు, నాయకులు క్షీరాభిషేకం చేశారు.
తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి కేసీఆర్
సిరిసిల్ల టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్తబస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్‌ఎస్ ప్రజాప్రతి నిధులు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. కొత్త బస్టాండ్‌లోని తెలంగాణ అమరువీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పట్టణంలోని నేతన్న, అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మగాంధీ విగ్రహానికి, కొండ లక్ష్మణ్ బాపూజీ, సర్వాయి పాపన విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన దీక్షా దివస్‌లో అమరువీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశపత్తి శ్రీనివాస్ మాట్లాడారు. కేసీఆర్ ఆనవాలు మలిపేయాలనుకున్న నీకు అంటుకున్న బ్యాగుల మరక చరిత్రలో మలిగిపోదని, కేసీఆర్‌కు ఉన్న కీర్తి తొలగిపోదని అన్నారు. ఎన్నికల ఫలితాలు అనుకున్నట్టు రాకపోవచ్చని, తెలంగాణ సామాజిక లక్ష్యం కోసం నిలబడిన వ్యక్తికి ఒకసారి జయం మరోసారి అపజయం రావచ్చని అన్నారు. సిరిసిల్ల గడ్డ మీద తెలంగాణ కోసం నిలబడినవారు ప్రతీసారి జయాన్నే పొందారని, సిరిసిల్లకు శిరస్సు వంచి మొక్కుతున్నాని అన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తెలంగాణ పోరాటాన్ని పురికొల్పాయని, 1952లో ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. 1969లో 369 మంది బిడ్డలు అసెంబ్లీ ముందు అమరు లయ్యారన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో సాగిన తెలంగాణ ప్రయాణాన్ని మలుపు తిప్పి గెలపుబాటలో పయనింప జేసిన చారిత్రత్మక దీక్ష కేసీఆర్ ఆమరణ దీక్ష అన్నారు. నవంబరు 29 దీక్ష దివస్ చరిత్రలో ఒక మహాత్తరమైన రోజన్నారు. నవంబరు 29 లేనిది డిసెంబరు 9 లేదని, డిసెంబరు 9 లేనిది జూన్ 2లేదని అన్నారు. జూన్ 2 తెలంగాణ పుట్టుకకు కేసీఆర్ దీక్ష మంత్రసాని అయ్యిందన్నారు. కేసీఆర్ ఆనవాలు మలిపేస్తానంటున్నాడని, నవంబరు 29 దీక్షను మలిపేస్తావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన దిక్సూచి కేసీఆర్ అని, చరిత్ర నుదిట మీద కాలం చేసిన సంతకం కేసీఆర్ అని, కాగితాల మీద సంతకం కాదని అన్నారు. కేసీఆర్ ఆనవాలు మలిపేయడం అంటే మలిదశ తెలంగాణ ఉద్యమాన్నే మలిపేయాలనుకుంటున్నాడని ఆరోపించారు. కనిపించని కిరీటాలు పెట్టుకుంటాడంటని, తెలంగాణ తల్లికి కిరీటం ఉండవద్దంటని అన్నారు. తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే దొరసానిలా ఉందని వక్రబుద్ధిని ప్రదర్శించాడని, ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు ఆవిష్కరించుకున్నారని అన్నారు. ప్రజల బాగోగులు చూస్త లేడని తన బ్యాగోగులు చూసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆ బ్యాగులకు కేసీఆర్ చరిత్ర అడ్డువస్తుందని అన్నారు. దీక్ష దివస్ నాడు మలుపు తిప్పితే నేడు బీఆర్‌ఎస్ మరో దీక్ష దివస్ విజయాన్ని సాధించిందన్నారు. కేటీఆర్ దెబ్బకు ప్రజాపాలన పునాదులు వణికి లగచర్లలో భూమి సేకరణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రద్దు చేసుకుందన్నారు. తెలంగాణకు ఒక సామాజిక స్వేచ్ఛను కేసీఆర్ తీసుకొచ్చారని, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించారు. గాంధేయ మార్గంలో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ వంటి నాయకుడిని చూడలేదని ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకంలో ఉందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రివి మలిపేస్తానంటే మొట్టమొదటగా ప్రణబ్ ముఖర్జీ రాసినది మలిపేయగలవా? అని ప్రశ్నించారు. పక్క పార్టీలో నుంచి వచ్చిన బ్యాగుల బాబుజీకి అసలు ప్రణబ్ ముఖర్జీ తెలుసా? అన్నారు. సామాజిక లక్ష్యం కోసం కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని కాదనుకున్నారని, అది చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. దీక్ష దీవస్ తెలంగాణ ప్రజలందరు చేసుకోవాల్సిన పండగని, కేసీఆర్, జయశంకర్ తెలంగాణకు సూర్యచంద్రుల్లాంటి వారని అన్నారు. తెలంగాణ ఉద్యమం తుది దశకు వచ్చిన సమయంలో పిల్లలు చనిపోవద్దని అమరణదీక్షతో తెలంగాణ సాధ్యమని కేసీఆర్ నవంబరు 29న దీక్షను మొదలుపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్స్ జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, జడ్పి మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, గ్రంథాలయం మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ డైరెక్టర్‌లు, ప్యాక్స్ చైర్మన్లు, వివిధ మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:57 PM