కోరుట్ల సాయిబాబా ఆలయం ముస్తాబు
ABN, Publish Date - Oct 12 , 2024 | 12:27 AM
పట్టణంలోని షిరిడీ సాయిబాబా ఆల యంలో ఆదివారం నిర్వహించే 106వ పుణ్యతిథి వేడుకలకు ఆలయం ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం లక్షకు పైగా భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.
- రేపు 106వ పుణ్యతిథి వేడుకలు
- కొనసాగుతున్న ఏర్పాట్లు
కోరుట్ల, అక్టోబరు 11: పట్టణంలోని షిరిడీ సాయిబాబా ఆల యంలో ఆదివారం నిర్వహించే 106వ పుణ్యతిథి వేడుకలకు ఆలయం ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం లక్షకు పైగా భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. అక్టోబరు 13 తేదీన ఉదయం 106వ పుణ్యతిథి అన్నదాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పుణ్యతిథి రోజున ఉదయం ఐదు గంటల నుంచి కాగడ హారతి, 5:30 గంటలకు ఆలయ సంకీర్తన, 6:30 గంటలకు అభిషేకం, 8:30 గంటలకు పతాకారోహణ, గణపతిపూజ, 9:30 గంటలకు కలషాభిషేకం, 10:30 గంటలకు విశ్వకర్మ యజ్ఞము, 11 గంటల నుంచి మద్యాహ్నం 3:00 గంటల వరకు అన్నదానం నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి ఏర్పాట్లను చేస్తు న్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతీఒక్కరికి బాబా దర్శనం కల్పించనున్నారు. భక్తులకు ప్రసాదం పులిహోర, లడ్డు తయారీలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. దేవాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం, పోలీసు బందోబస్తు నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ సేవా సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించే విధంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన జువ్వాడి
పట్టణంలో సాయిబాబ దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం జరిగే పుణ్యతిథి వేడుకల ఏర్పా ట్లును జువ్వాడి కృష్ణారావు, దేవాలయ అభివృద్ధి కమిటి సభ్యులు పరిశీలించారు. దేవాలయంలో జరగుతున్న పుణ్యతిఽథి వేడుకలలో నిర్వహించే కార్యక్రమాలను దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.
Updated Date - Oct 12 , 2024 | 12:27 AM