ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం..

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:56 PM

ఏచూరి సీతారాం ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో సీతరాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాం ఏచూరి మృతి దురదృష్టకరమన్నారు.

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 15: ఏచూరి సీతారాం ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో సీతరాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాం ఏచూరి మృతి దురదృష్టకరమన్నారు. దేశ రాజకీయాలపై అవగాహన ఏర్పరచుకుని సమ సమాజం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. సీతారాం ఏచూరి బతికినంత కాలం పేద ప్రజల కోసమే బతికారని, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి సీపీఎంను ముందుకు నడిపారన్నారు. సీతారాం ఏచూరి మరణం వామపక్షాల ఉద్యమాలకే కాకుండా భారతదేశ రాజకీయాలకు, పేద ప్రజలకు తీరని లోటని అన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి భీమాసాహెబ్‌, జిందం ప్రసాద్‌ మాట్లాడుతూ సీతారాం ఏచూరి తన మరణం తరువాత కూడా జీవించి ఉండేలా శరీరాన్ని పరిశోధనలకు ఇవ్వడం ఎంతో మందికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్‌, నరేష్‌, జిల్లా నాయకులు కోనేటి నాగమణి, జి తిరుపతి, తిప్పారపు సురేష్‌, వడ్ల రాజు, రాయికంటి శ్రీనివాస్‌, పుల్లెల మల్లయ్య, గజ్జెల శ్రీకాంత్‌, కాంపెల్లి అరవింద్‌, కాల్వ సురేష్‌, జనగాం రాజమల్లు, రాంమోహన్‌, నందల సత్యనారాయణ, రాంపెల్లి శ్రీనివాస్‌, దేవేంద్ర, రోజారాణి, యమున, లావణ్య, బోడ మోహన్‌, గుండేటి వాసుదేవ్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:56 PM

Advertising
Advertising