మధుమేహ రహిత నగరంగా తీర్చిదిద్దుతాం
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:16 AM
రామగుండాన్ని మధుమేహ రహిత నగ రంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేద్దామని మేయర్ అనిల్‌కుమార్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పిలుపునిచ్చారు.
కోల్‌సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రామగుండాన్ని మధుమేహ రహిత నగ రంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేద్దామని మేయర్ అనిల్‌కుమార్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్క రించుకొని గోదావరిఖని లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రీగల్ షూమా ర్ట్ నుంచి మున్సిపల్‌కార్పొరేషన్ కార్యాలయం వరకు 2కే రన్ నిర్వహించారు. అనం తరం నగర పాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య అల వాట్లు, వ్యాయామం క్రమం తప్పకుండా ఔషదాలు తీసుకోవడం ద్వారా మధుమే హాన్ని నియంత్రించవచ్చని మేయర్ అన్నారు. రామగుండాన్ని మాదకద్రవ్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌యంత్రాంగం కృషి చేస్తుందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు పి.మల్లిఖార్జున్, ప్రతినిధులు చంద్రమౌళి, బంక రామస్వామి, రాజేందర్, వీరేశం తదిత రులు పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:16 AM