ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు

ABN, Publish Date - Mar 16 , 2024 | 12:19 AM

అర్హులందరికి తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

పెద్దపల్లి రూరల్‌ , మార్చి 15 : అర్హులందరికి తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరం లో పెద్దపల్లి పట్టణ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మందికి కల్యా ణలక్ష్మీ, 17మందికి షాదీముబారక్‌ రూ.40లక్షల 4వేల 640 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే విజయరమణరావు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేయడంతో పాటె కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా డబ్బుతో పాటు తులం బంగారం అందజేస్తామన్నారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలను దశల వారిగా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ఆర్‌టీసీలో బస్సుల్లో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల భీమా సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరుచేసినట్లు తెలిపా రు. ఇళ్లు లేనివారికి పేద కుటుంబాలకు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ గౌడ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్‌, తూముల సుభాష్‌,అమరేష్‌, ఎంపీటీసీ ఎడెల్లి శంకర్‌, నాయ కులు సందనవేని రాజేందర్‌, కుమార్‌, శ్రీకాంత్‌, ఆర్‌ఐ నవీన్‌రావుతో పాటు కాం గ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే హన్మంతునిపేటలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వారి వెంట జడ్పీటీసీ రామ్మూర్తి, తిరుపతిరావు, గుజ్జుల కుమార్‌, వాసు, రమేష్‌, సతీష్‌, ప్రసాద్‌, సుధా కర్‌రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:19 AM

Advertising
Advertising