ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెకానికల్‌ విభాగమే కీలకం..

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:31 AM

ఇంజనీరింగ్‌ విద్యలోని ప్రతి బ్రాంచ్‌ల్లో మెకానికల్‌ విభాగమే కీలకమని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ ఠాకూర్‌ అన్నారు.

రామగిరి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : ఇంజనీరింగ్‌ విద్యలోని ప్రతి బ్రాంచ్‌ల్లో మెకానికల్‌ విభాగమే కీలకమని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ ఠాకూర్‌ అన్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌ చెరుకు శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన అర్ధోబోటిక్స్‌ రోబోటిక్స్‌పై రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ విభాగంలో మెకానికల్‌కు ప్రాధాన్యత తగ్గినా విద్యార్థులు అధైర్య పడవద్దన్నారు. ప్రతి విభాగంలోనూ మెకానికల్‌ విభాగం ప్రాముఖ్యత, ప్రాధాన్యం ఉంటుందన్నారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మైనింగ్‌ బ్రాంచ్‌లన్నీ మెకానికల్‌ బ్రాంచ్‌పై ఆధారపడినవేనని పేర్కొన్నారు. మెకానికల్‌ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. మంథని జేఎన్టీయూ కళాశాలకు ఎలాంటి సహాయసహకారాలైనా అందించడానికి ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ముందు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్స్‌ సతీష్‌పడినాల్‌, శేఖర్‌లాల్‌, ఫ్యాకల్టీ సలహాదారు పి. స్వప్న, స్టూడెంట్‌ కోఆర్డినేటర్స్‌ బి. లోకేష్‌, శ్రీనాథ్‌, లావణ్య, సంగీత, ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:32 AM