ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్య విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:00 AM

వైద్య విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా రూ.26కోట్లతో మంజూరు చేసిన నర్సింగ్‌ కాలేజీని ఆయన ప్రారంభించారు.

నర్సింగ్‌ కళాశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

రామగుండంలో నర్సింగ్‌ కళాశాల ప్రారంభం

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా రూ.26కోట్లతో మంజూరు చేసిన నర్సింగ్‌ కాలేజీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్‌జన్మనిస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి కష్టాన్ని వృధా చేయకుండా విద్యార్థులు శ్రద్ధగా చదివి ప్రపంచస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో అందరూ భయపడి ఇంట్లో ఉంటే వైద్య సిబ్బంది, నర్సింగ్‌ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎందరో ప్రాణాలను కాపాడారని, దేశ, ప్రపంచంలోని జనాలకు భరోసా ఇచ్చారన్నారు. రామగుండం మెడికల్‌ కళాశాలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేశామన్నారు. రామగుండం మెడికల్‌ కళాశాలలో పీజీ విద్యతో పాటు డెంటల్‌ కాలేజీ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడానని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. నర్సింగ్‌ కళాశాల బిల్డింగ్‌ నిర్మాణానికి ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. మెడికల్‌ కళాశాల నుంచి జనరల్‌ ఆసుపత్రికి రాజీవ్‌ రహదారిపై స్కైవేను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.

ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ ప్రారంభం..

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయగా గోదావరిఖని ప్రభుత్వజనరల్‌ ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన మైత్రి ట్రాన్స్‌ క్లినిక్‌ను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు వైద్యం కోసం మైత్రి క్లినిక్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ మహంకాళి స్వామి, ఆర్‌ఎంవోలు అప్పారావు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:00 AM