ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వలస కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:36 AM

ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఆయా గోదా ముల్లో, రైస్‌మిల్లుల్లో, ఇటుక బట్టీల్లో పని చేస్తున్న సందర్భాల్లో వారికి వసతి సౌక ర్యాలు కల్పించాలని పెద్దపల్లి కార్మిక శాఖ అధికారి హేమలత అన్నారు.

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 4: ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఆయా గోదా ముల్లో, రైస్‌మిల్లుల్లో, ఇటుక బట్టీల్లో పని చేస్తున్న సందర్భాల్లో వారికి వసతి సౌక ర్యాలు కల్పించాలని పెద్దపల్లి కార్మిక శాఖ అధికారి హేమలత అన్నారు. సుల్తానా బాద్‌ పట్టణంలోని యాదవనగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద గల గోదాములను ఆమె బుధవారం సందర్శించి గత నెలలో చనిపోయిన బీహార్‌ రాష్ట్రానికి చెందిన కార్మికు డి వివరాలను సేకరించారు. గోదాములో దాదాపు రెండు వందల మంది ఛత్తీష్‌గ ఢ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి సంబం ధించిన రికార్డులు కానీ, వలస కార్మికులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కానీ గోదాము నిర్వాహకులు చూపలేదన్నారు. అసలు గోదాము ఓనర్‌షిప్‌ పత్రా లు కూడా వారివద్ద లేవన్నారు. కాగా, గతనెల 14న బీహార్‌కు చెందిన ఓ కార్మికు డు రాత్రంతా పనిచేసి తన గదిలో పడుకునేందుకు వెళితే అక్కడ ఉక్కపోత భరిం చలేకి గోదాము ఆవరణలో బియ్యం లోడ్‌తో ఉన్న లారీపైన నిద్రించాడు. నిద్ర మత్తులో లారీ పైనుంచి కింద పడి మరుసటి రోజు మృతిచెందాడు. ఈ కేసు విచారణ కోసం లేబర్‌ ఆఫీసర్‌ గోదాములో కార్మికుల వివరాలు సేకరించారు. అలాగే వలస కార్మికుల వద్దకు వెళ్లి వారికి కల్పిస్తున్న వసతి సౌకర్యాల గురించి అరా తీశారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను పనిలో పెట్టుకుంటే అందుకు సంబంధించిన రికార్డులు కూడా నిర్వహించాలని కార్మిక శాఖ అధికారి హేమలత గోదాము నిర్వాహకులకు సూచించారు.

Updated Date - Sep 05 , 2024 | 12:36 AM

Advertising
Advertising