ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సన్నరకం ధాన్యంపై మిల్లర్ల అభ్యంతరాలు

ABN, Publish Date - Oct 12 , 2024 | 12:55 AM

ఈ వానాకాలం సీజన్‌లో ప్రభుత్వ సూచన మేరకు ఎక్కువ మొత్తంలో రైతులు సన్న రకం వరి పంటనే సాగు చేస్తుండగా, తద్వారా వచ్చే పంటను సీఎంఆర్‌ కింద తీసుకునేందుకు రైస్‌ మిల్లర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

- ఓట్‌ టర్న్‌ 67 నుంచి 58 శాతానికి తగ్గించాలి

- లేదంటే క్వింటాలుకు రూ.300 పరిహారం ఇవ్వాలి

- ప్రభుత్వం ముందుకు వివిధ రకాల డిమాండ్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఈ వానాకాలం సీజన్‌లో ప్రభుత్వ సూచన మేరకు ఎక్కువ మొత్తంలో రైతులు సన్న రకం వరి పంటనే సాగు చేస్తుండగా, తద్వారా వచ్చే పంటను సీఎంఆర్‌ కింద తీసుకునేందుకు రైస్‌ మిల్లర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సన్న రకం వరి ధాన్యం ఔట్‌ టర్న్‌ 67శాతం రాదని, 58 శాతం మాత్రమే వస్తుం దని చెబుతున్నారు. 58శాతానికి తగ్గించాలని, లేకుంటే క్వింటాలు ధాన్యానికి 300 రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్ల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం నిల్వల తరుగుదలపై 1శాతం డ్రైయేజ్‌ చార్జీలను చెల్లిం చాలని, రైస్‌మిల్లులో ధాన్యం నిల్వచేసినందుకు ప్రతి నెలా క్వింటాలు ధాన్యానికి 2.40 రూపాయల చొప్పున ప్రతి సీజన్‌కు రెండుసార్లు కస్టోడియన్‌ చార్జీలు ఇవ్వాలని, బియ్యం రవాణా, బ్లెండింగ్‌ చార్జీలు చెల్లించాలని కోరుతున్నారు. బియ్యాన్ని మర ఆడించేందుకు రా రైస్‌కు క్వింటాలుకు 10 రూపాయలు, బాయిల్డ్‌ రైస్‌కు 20 రూపాయల చొప్పున చెల్లించాలని 6 సంవత్సరాల మిల్లింగ్‌ చార్జీలను చెల్లించాలని కోరుతున్నారు. అలాగే తేమ శాతాన్ని 17గాకుండా 14 శాతానికి తగ్గించాలని, లేకుంటే ఔట్‌ టర్న్‌ రాదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమా ణాలు పాటించడం లేదని, నాణ్యతను చూడకుండానే కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. డ్యామేజీ అయినవి, డిస్‌కలర్‌ ధాన్యం, ఇమ్మెచ్యూర్‌ అయిన ధాన్యం తీసుకోవడం వల్ల అధిక నూకలు వచ్చి ఔట్‌ టర్న్‌ రావడం లేదని చెబుతున్నారు. తమ సమస్యల ను పరిష్కరించడంతో పాటు నాణ్యతను పాటిస్తేనే ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద తీసుకుంటామని మిల్లర్లు చెబుతున్నారు.

జిల్లావ్యాప్తంగా 2,09,562 ఎకరాల్లో వరి..

ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2,09,562 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఇందులో దొడ్డు రకం వరి 36,676 ఎకరాల్లో సాగు చేయగా, సన్న రకం 1,72,879 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 78.79 శాతం సన్న రకం పంటను సాగు చేశారు. గతంలో సన్న రకం వరి ధాన్యం సాగు 35 శాతానికి మించలేదు. ఈసారి రికార్డు స్థాయిలో సన్నాలను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా బీపీటీ, సాంబమశూరి, జైశ్రీరాం, చిట్టి ముత్యాలు తదితర రకాల వరి ధాన్యాన్ని సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా సాగు చేసిన వరి సాగు వల్ల 4 లక్షల 49 వేల 554 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వస్తుందని, ఇందులో దొడ్డు రకం 91 వేల 700 టన్నులు, సన్న రకం 3 లక్షల 97 వేల 615 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. సన్న రకం ధాన్యం దిగుబడిలో 10 శాతం తిండి అవసరాలకు పోను 3 లక్షల 57 వేల 853 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం కేంద్రాలకు వస్తే మాత్రం క్వింటాలుకు 500 రూపాయల చొప్పున 178 కోట్ల 92 లక్షల రూపాయల బోనస్‌ భారం ప్రభుత్వంపై పడనున్నది. ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం కామన్‌ రకం వరి ధాన్యం క్వింటాలుకు 2300 రూపాయలు కాగా, గ్రేడ్‌ ఏ రకం 2,320 రూపాయలు. అయితే సన్న రకం ధాన్యాన్ని ఏ గ్రేడ్‌ కింద తీసుకుంటారో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైస్‌మిల్‌ వ్యాపారులు తమ డిమాండ్లన్నింటినీ మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకవెళ్లారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను రూపొందించిన తర్వాత సీఎంకు అందజేయనున్నారు. ఆయన తీసుకునే నిర్ణయంపై మిల్లర్లు ధాన్యం తీసుకుంటారా, లేదా అని తేలనున్నది.

Updated Date - Oct 12 , 2024 | 07:45 AM