ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ గూటికి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

ABN, Publish Date - Jun 24 , 2024 | 12:52 AM

జగిత్యాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైద్రాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

జగిత్యాల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైద్రాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్‌ నేత పోచారం శ్రీనివాస్‌ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేసిన విషయం విధితమే. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన డాక్టర్‌ సంజయ్‌ జగిత్యాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో పర్యాయం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ (కంటి శస్త్ర వైద్య నిపుణులు) విద్యను అభ్యసిం చిన సంజయ్‌ జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లో నేత్ర వైద్యుడిగా మంచిగుర్తింపు పొందారు.

పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి సుమారు 20వేల ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. తొలిసారిగా బీఆర్‌ఎస్‌లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవ ర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి 62,616 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు 54,788 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో పర్యాయం పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా పోటీ చేసిన డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు 1,04,247 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి 43,062 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌కు 70,243 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డిపై 15,822 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. వరసగా రెండో పర్యాయం మాకునూరి సంజయ్‌కుమార్‌ విజయం సాధించారు. కొంత కాలంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌తో టచ్‌లో ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షం లో అధికారికంగా ఎమ్మెల్యే సంజయ్‌కు మార్‌ కాంగ్రెస్‌గూటికి చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jun 24 , 2024 | 12:52 AM

Advertising
Advertising