పునరావాస కేంద్రాలకు నిరాశ్రయుల తరలింపు
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:47 PM
కరీంనగర్‌లో గురువారం అర్ధరాత్రి కరీంనగర్ ఏసీపీ గోపతి నరేందర్ ఆధ్వర్యంలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి రోడ్లపై, కూడళ్లలో నిద్రిస్తున్న, వీధుల్లో తిరుగుతున్న నిరాశ్రయులను గుర్తించి పునరావాస కేంత్రాలకు తరలించారు.
కరీంనగర్ క్రైం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో గురువారం అర్ధరాత్రి కరీంనగర్ ఏసీపీ గోపతి నరేందర్ ఆధ్వర్యంలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి రోడ్లపై, కూడళ్లలో నిద్రిస్తున్న, వీధుల్లో తిరుగుతున్న నిరాశ్రయులను గుర్తించి పునరావాస కేంత్రాలకు తరలించారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైజ్‌తో వేలిముద్రలను తనిఖీ చేసి గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా? అనే అనుమానాలను నివృత్తి చేసుకున్న అనంతరం 40 మందిని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కోతిరాంపూర్‌లోని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించినట్లు కరీంనగర్ ఒకటో ఠాణా సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో రెండో ఠాణా సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 11:47 PM