ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:39 AM

కుల వృత్తులను పెంపొందించే దిశగా మాజీ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విమర్శించారు.

బావుపేట చెరువులో చేపపిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

భగత్‌నగర్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కుల వృత్తులను పెంపొందించే దిశగా మాజీ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విమర్శించారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలోని బావుపేట బావుచెరువులో చేపపిల్లలను వదిలిన అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుల వృత్తుల చేసుకుని బతికేవారి జీవితాలు దుర్భరంగా తయారయ్యాయన్నారు. గంగపుత్రులు, మత్స్యకారుల అభివృద్ధి చెందాలనే కేసీఆర్‌ ఎండిపోయిన చెరువుల్లోకి నీరు నింపి లక్షల రూపాయల విలువ గల చేపపిల్లలను వేయించారన్నారు. చేపపిల్లల పెంపకం ద్వారా గంగపుత్రులు, మత్స్యకారులకు చేతినిండాపని కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈసారి చేపల పెంపకం తగ్గిపోయిందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో రొయ్యల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చి చెరువుల్లో వేయించామన్నారు. చేపలను ఇతర ప్రాంతాలకు సరఫరా చేశామన్నారు. కులవృత్తులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధిచేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల రవి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రెడ్డవేని మధు, మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు సాబీర్‌ పాషా, మనోహర్‌, అంజనేయులు, రామనవేని కనకయ్య, తిరుపతిస్వామి, సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:39 AM