మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద
ABN, Publish Date - Jul 17 , 2024 | 01:00 AM
: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నేరెళ్ల శారదను రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ఆమె ఉదయం 10 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు.
కరీంనగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నేరెళ్ల శారదను రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో ఆమె ఉదయం 10 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే 37 కార్పొ రేషన్లకు చైర్మన్లను నియమిస్తూ మార్చి 15న జీవో ఆర్‌టీ 445 జారీకాగా ఎన్నికల కారణంగా పెండిం గ్‌లో పడిపోయింది. ఇదే సమయంలో ఈ నియామకాలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర మంత్రులతో కలిసి ఇటీవల ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో చర్చలు జరిపి ఈ నియామ కాలకు ఆమోదముద్ర వేయించుకున్నారు. దీనితో ఈనెల 8న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ పెండింగ్‌లో పెట్టిన జీవోను విడుదల చేశారు. గతంలో ఈ నియామకాలలో 37 మందికి పదవులు లభించగా అందులో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి పొందిన జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ నేత, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారదకు అవకాశం కల్పించారు. 35 మందికి మాత్రమే నియామకాలు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గవర్నర్ ఆమోద ముద్ర కోసం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి జీవో వెలువడలేదు. తాజాగా మంగళవారం ప్రభుత్వం మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించను న్నారు. క్రియాశీల కార్యకర్తగా పార్టీకి విధేయతతో చాలా కాలంగా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు వివిధ హోదాల్లో కృషిచేసిన నేరెళ్ల శారద మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి కట్టబెట్టారు. పార్టీ పటిష్టతకు కృషి చేసిన కాంగ్రెస్‌పార్టీ విధేయతకు పదవులను ఇచ్చి సముచిత ప్రాధాన్యం కల్పించినట్లయింది. మహిళా కమిషన్ చైర్మన్‌గా నియామకమైన నేరెళ్ల శారద 2001లో రామడుగు జెడ్పీటీసీగా, టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా, జిల్లా అధ్యక్షురాలుగా, కరీంనగర్ జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్ పర్సన్‌గా గతంలో పనిచేశారు. కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్ద నేరెళ్ల శారదకు మంచి గుర్తింపు ఉంది. ఆమె జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలుగా ఉన్నారు. గత కొంత కాలంగా నేరెళ్ల శారద హైదరాబాద్‌లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలను స్వీకరించనున్న నేరెళ్ల శారదకు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.
Updated Date - Jul 17 , 2024 | 01:00 AM