ఎన్టీపీసీలో కొత్త ఆవిష్కరణలు
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:36 AM
స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్న ఎన్టీపీసీ కొత్త ఆవిష్కర ణకు వేదిక అవుతున్నదని రామగుండం ప్రాజెక్టు, ఆర్‌ఈడీ(దక్షిణ) కేదార్ రంజన్‌పాండు అన్నారు.
జ్యోతినగర్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్న ఎన్టీపీసీ కొత్త ఆవిష్కర ణకు వేదిక అవుతున్నదని రామగుండం ప్రాజెక్టు, ఆర్‌ఈడీ(దక్షిణ) కేదార్ రంజన్‌పాండు అన్నారు. ఎన్టీ పీసీ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలల్లో పాల్గొని ప్రసంగించారు. ఎన్టీపీసీ గ్రీన్‌హెడ్రోజన్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టిందని, కాశ్మీర్‌లోని లేహ్‌లో గ్రీన్‌హైడ్రోజన్ ఇంధనంగా వాహనాలను ప్రయోగాత్మకంగా నడుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానం, దేశ అభివృద్ధికి ఎన్టీపీసీ చేయూతనందిస్తుందని తెలి పారు. అనంతరం హైదరాబాద్, మంచిర్యాల కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్ర మాలు ఆకట్టుకున్నాయి. జీఎంలు, అధికారులు, యూనియన్ల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 12:36 AM