ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్వీసును క్రమబద్ధీకరించండి

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:35 AM

తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ కన్వర్షన్‌ జేఏసీ (టీవీఏసీ జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేస్తున్న టీవీఏసీ జేఏసీ నాయకులు

గణేశ్‌నగర్‌, నవంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ కన్వర్షన్‌ జేఏసీ (టీవీఏసీ జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో పనిస్తున్న ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులర్‌ చేశామని నమ్మించి మోసం చేశారని తెలిపారు. 20, 25 ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సంస్థలో ఒకే రూల్‌ ఉండాలని కాని తమకు బ్రిటిష్‌ కాలం నాటి స్టాండింగ్‌ రూల్స్‌ ఇచ్చారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సానుకూలంగా స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలోకరీంనగర్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌ జి శివకృష్ణ, ఫైనాన్సియల్‌ సెక్రెటరీ ఎండీ అమానుల్లా, కె శ్రీనివాస్‌నాయక్‌, ఎం శ్రీనివాస్‌, ఎండీ అబుషర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:35 AM