‘డబుల్’ ఇళ్లు రానివారికి ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:07 AM
: సిరిసిల్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లు రానివారికి ఇందిరమ్మ ఇళ్ల పఽథకంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంటి నిర్మాణాలకు స్థలాలను కేటాయించి నిర్మాణాలకు రూ.5లక్షల చొప్పున అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లు రానివారికి ఇందిరమ్మ ఇళ్ల పఽథకంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంటి నిర్మాణాలకు స్థలాలను కేటాయించి నిర్మాణాలకు రూ.5లక్షల చొప్పున అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సొంత ఇళ్లు వస్తుందని, అత్మగౌరవంతో బతకవచ్చుననే ఆశతో ఎదు రు చూసిన నిరుపేదల ఆశలు నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో డ్రా పద్ధతిన ఎంపిక చేయడంతో అర్హులైన వారికి అన్యాయం జరిగిందన్నారు. దీంతోపాటు అధికారులు సరైన సర్వే నిర్వహించకపోవడంతో అనర్హులకు ఇళ్లు వచ్చాయన్నారు. అసలైన నిరుపేదలకు అన్యాయం జరిగిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు అర్హులై ఉండి డ్రాలో పేరు రానివారు ఉన్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, పట్టణ కార్యదర్శి అన్నల్‌దాస్ గణేష్, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, బెజుగం సురేష్, మోర తిరుపతి, నల్లబాలు, దాసరిరూప, గట్ల స్వప్న , బోనాల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 01:07 AM