శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:49 AM
శాంతి భధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల క్రైం, నవంబరు 9, (ఆంధ్రజ్యోతి) : శాంతి భధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని దర్యాప్తు కేసుల స్థితిగతులతో పాటు నేరస్తుల అరెస్టులకు సంబం ధించిన అంశాలను పరిశీలించి ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారు. సబ్ డివిజన్ స్థాయి అధికారి తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తూ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షించా లన్నారు. కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా జరిగేందుకు స్టేషన్ అధికారులకు సూచనలను అందించాలన్నా రు. సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలన్నారు. రౌడీషీటర్లపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించా రు. పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అప్పుడే విధులు సమర్ధవంతంగా నిర్వహించగల మన్నారు. ఒత్తిడిలో ఎన్నో ఆటంకాలను ఎదు ర్కొంటున్న పోలీసు అధికారులకు, సిబ్బంది ఆరో గ్య ప్రయోజనాల కోసం జిల్లా పోలీసుశాఖ ఆధ్వ ర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు, యోగా తరగతులు, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నా రు. ఉచిత వైద్యశిబిరానికి వచ్చిన పోలీసు అధికా రులకు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిం చిన ఎల్వీ ప్రసాద్, అశ్విని హాస్పిటల్, తారకరామ, కృష్ణన్యూరో, కోనార్క్ హాస్పిటల్ వైద్యులకు సిబ్బందికి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐలు కృష్ణ, మొగిలి శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు యాదగిరి, రమేష్, స్పెషల్ భ్రాంచ్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 12:49 AM