ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బొగ్గు నిక్షేపాలను ప్రైవేట్‌పరం చేస్తే సహించం

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:42 AM

తెలంగాణలోని బొగ్గు బ్లాకుల నుంచి ప్రైవేట్‌ వ్యక్తులు బొగ్గును తీసుకెళదామంటే ఊరుకునేది లేదని, తట్టెడు బొగ్గును కూడా తీయకుండా అడ్డుకుంటామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి హెచ్చరిం చారు.

గోదావరిఖని, జూన్‌ 29: తెలంగాణలోని బొగ్గు బ్లాకుల నుంచి ప్రైవేట్‌ వ్యక్తులు బొగ్గును తీసుకెళదామంటే ఊరుకునేది లేదని, తట్టెడు బొగ్గును కూడా తీయకుండా అడ్డుకుంటామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి హెచ్చరిం చారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూగర్భంలోని బొగ్గు, ఖనిజ నిక్షేపాలను పైవ్రేటు వ్యక్తులకు దారధత్తం చేస్తూ కాంగ్రెస్‌ ప్రారంభించిన దుర్మార్గమైన పద్ధతులకు బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రైవేటీకరణ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్‌, ఐఎన్‌టీయూసీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్మికులు గమనించాల ని ఆయన కోరారు. ఎం ఎండీఆర్‌-2015 చట్టాన్ని మూజువాని ఓటు ద్వారా బీజేపీ ప్రభుత్వం ఆమోదించుకున్నదని రాజిరెడ్డి చెప్పారు. బొగ్గు, ఇతర ఖనిజాల తవ్వకంపై బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసిందని ఆయన వెల్లడించారు. దేశంలోని బొగ్గు పరిశ్రమల్లో కార్మికుల సంఖ్య గడిచిన పదేళ్లలో 60శాతానికి కుదించబడటం అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పుణ్యమేనని రాజిరెడ్డి ఆరోపించారు. బొగ్గు బ్లాకుల వేలం వేయటం అంటేనే బొగ్గు సంస్థల పైవ్రేటీకరణ అని రాజి రెడ్డి చెప్పారు. బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియకు వ్యతిరేకంగా పోరాటాలకు కలిసి వచ్చే కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలతో ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తామని రాజిరెడ్డి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో కార్మిక నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, కే సురేందర్‌ రెడ్డి, పర్లపల్లి రవి, జాహిద్‌ పాషా, పింగిలి సంపత్‌ రెడ్డి, చల్ల రవీందర్‌ రెడ్డి, జాఫర్‌ హుస్సేన్‌, పోలాడి శ్రీనివాస్‌, దూట శేషగిరి పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 12:43 AM

Advertising
Advertising