ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నగరంలో సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:34 AM

నగరంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాయలం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ సమస్యలతో ప్రజలు సతమవుతున్నా నగరపాలక సంస్థ పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 11 (ఆంఽధ్రజ్యోతి): నగరంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాయలం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ సమస్యలతో ప్రజలు సతమవుతున్నా నగరపాలక సంస్థ పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రధాన రహదారుల్లోని డివైడర్లలో నాటిన కోనో కార్పస్‌ చెట్లను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో కోతులు, వీధికుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటి నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. డంపింగ్‌యార్డు నుంచి వచ్చే పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యార్డును ఇతర ప్రాంతానికి తరలించాలని కోరారు. కరీంనగర్‌ పరిసరాల్లోని ప్రభుత్వ శిఖం, ఎస్సారెస్పీ భూములు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గాజుల కనకరాజు, కొంపల్లి అరవింద్‌, కండె రాజు, డబిల్కర్‌ శ్రీకాంత్‌, రేణిగుంట అవినాష్‌, రాము, శ్రీనివాస్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:34 AM