ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బొగ్గు బ్లాకుల వేలంపై రాద్ధాంతం

ABN, Publish Date - Jul 17 , 2024 | 12:32 AM

నూతన బొగ్గు గనుల వేలంపై కొంతమం ది రాజకీయం చేస్తున్నారని బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్త య్య ఆరోపించారు.

గోదావరిఖని, జూలై 16: నూతన బొగ్గు గనుల వేలంపై కొంతమం ది రాజకీయం చేస్తున్నారని బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్త య్య ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015లో పార్లమెంట్‌లో ఎంఎండీఆర్‌ చట్టాన్ని ఆమోదించారని, ఒరిస్సాలోని నైని బ్లాక్‌ను, మహాపాత్ర బాక్‌ను సింగరేణి వేలం పాటలో దక్కించుకోవడం జరి గిందన్నారు. గత ప్రభుత్వం నూతన బొగ్గు బ్లాకుల వేలం పాటల్లో సింగరేణి యాజమాన్యాన్ని పాల్గొనకుండా చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వం వేలం పాట పెట్టిందన్నారు. ఎంఎండీఆర్‌ చట్టంలో మార్పు లు చేయాలని గతంలోనే బీఎంఎస్‌ సూచించడం వల్ల కొన్ని మార్పు చేశారని చెప్పారు. గత రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు బ్లాకులను వేలం పాటలో సింగరేణి యాజమాన్యం పాల్గొనకుండా చేసిందని, ఇప్పుడు దీన్ని రాద్ధాం చేస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా బొగ్గు గని కార్మికుల రక్షణ, పరిరక్షణ కోసం నిరంతరం బీఎంఎస్‌ పోరాటం చేస్తుం దన్నారు. నూతన బొగ్గు గనుల సాదనకు బీఎంఎస్‌ కృషి చేస్తుందని, అఖిల భారత మజ్దూర్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శి సుధీర్‌ గురుడే శ్రీరాం పూర్‌లో జరిగిన సమావేశంలో కొత్త గనులు వస్తాయని వెల్లడించారని చెప్పారు. సింగరేణికి నూతన బ్లాకుల కోసం సింగరేణి యాజమాన్యం వేలం పాటలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో బీఎంఎస్‌ నాయకులు సారంగపాణి, ఆకుల హరిణ్‌, మా దాసు రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2024 | 12:32 AM

Advertising
Advertising
<