ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రమేష్‌ను వెంటనే కోర్టులో హాజరుపరచాలి

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:20 AM

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్‌ పూనెం రమేష్‌ అరె స్టును ఖండించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ కోరారు.

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కార్యదర్శి, అజ్ఞాత దళ కమాండర్‌ పూనెం రమేష్‌ అరె స్టును ఖండించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ కోరారు. పూనేం రమేష్‌ను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం గోదావరిఖని పైలాన్‌ చౌరస్తాలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐ క్రిష్ణ మాట్లాడుతూ పూనెం రమేష్‌ ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురంలో ఆరోగ్యం బాగాలేక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈనెల 28న పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రమేష్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా ఏమైనా కేసులు ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం, పోడు భూముల రక్షణ కోసం పోరాడుతున్న న్యూడెమో క్రసీ నాయకులపై పోలీస్‌ నిర్బంధం కొనసాగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రమేష్‌కు ఎలాంటి ప్రాణహాన్ని జర గకుండా బేషరతుగా కోర్టులో హాజరుపరచాలన్నారు. ఈ నిరసనలో నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్‌, బీ అశోక్‌, కొల్లూరి మల్లేశ్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు మేరగు చంద్రయ్య, ఎం దుర్గయ్య, పైడిపల్లి రమేష్‌, సమ్మెట తిరు పతి, ఎం కొమురయ్య, ఐ సాంబయ్య, సదయ్య, ఏ చంద్ర య్య, జనార్ధన్‌, మాడ స్వామి, ఆటోసాయి, శ్రీనివాస్‌, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:20 AM