విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు తీసుకోవాలి
ABN, Publish Date - May 18 , 2024 | 12:08 AM
విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పనిసరి గా రసీదు తీసుకోవాలి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
పెద్దపల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పనిసరి గా రసీదు తీసుకోవాలి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ముజమ్మి ల్‌ఖాన్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవ గాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అద నపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాల లేబుల్స్, కలర్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు అమ్మాలని తెలిపారు. గడువు ముగిసిన విత్తనాల బ్యాగు లను పూర్తిస్థాయిలో స్టాక్ నుంచి తొలగించా లని, తనిఖీల సమయంలో గడువు ముగిసిన విత్తన బ్యాగులు విక్రయిస్తున్నట్లు దొరికితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిరిగిన విత్తనాల బ్యాగులను ఎట్టి పరిస్థితు ల్లోనూ విక్రయించవద్దని, సబ్సిడీ ఉన్న విత్త నాలు అర్హులైన వారికి మాత్రమే విక్రయించా లన్నారు. లైసెన్స్ లేని డీలర్లు విత్తనాలు విక్ర యించడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తన షాపు విక్రయదారులు రిజిస్టర్ మెయింటెన్ చేయాలని సూచించారు. విత్తన షాపులో అందుబాటులో ఉన్న విత్తనాల స్టాకు వివరా లను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డుపై నమో దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి జిల్లా స్థాయిలో పోలీసు, వ్యవసాయ, విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభు త్వ నిబంధనల మేరకు ఈ- పాస్ యంత్రాల ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు, విత్త నాలను అమ్మాలని ఆదేశించారు. ఏవో, ఏఈ వోలు, పోలీసు అధికారులు సమన్వయంతో ఎరువులు విత్తనాల షాప్‌లపై జాయింట్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బీటి 3 ప్రత్తి రకాల విత్తనాలకు చట్ట బద్ధత లేద ని దీనివలన పర్యావరణం, మానవాళి జీవన శైలికి హాని చేకూరుతుందని, కావున ఎవరైనా ఈ విత్తనాలను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల వళ్ళ పంట నష్టం గురించి రైతుల నుండి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసు కుంటానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ముజ మ్మిల్ ఖ్‌న్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధి కారి డి.ఆదిరెడ్డి, ఏసీపీ కృష్ణ, డీసీవో అధికారి శ్రీమాల, డీలర్‌లు, వ్యవసాయ శాఖ అధికా రులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2024 | 12:08 AM