ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:19 AM
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సమయంలో ఆడబిడ్డ లకు ఆశ చూపిన రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం చేసిందని మాజీ ఎమ్మె ల్యే, బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు ఆరో పించారు.
మంథని, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సమయంలో ఆడబిడ్డ లకు ఆశ చూపిన రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం చేసిందని మాజీ ఎమ్మె ల్యే, బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు ఆరో పించారు. ప్రభుత్వం ప్రజలను వంచించిన తీరును ఎండగడుతూ డిసెం బరు 9వ తేదీ వరకు మంథని నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టే కాంగ్రెస్ ప్రజా వంచన దినోత్సవాల నిరసన కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పుట్ట మధు గురువారం ప్రారంభించారు. ఇందు లో భాగంగా స్థానిక గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఎన్నికల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 11నెలలు గడిచిపోయి నా ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతా గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. 420 హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టి నయవంచన చేశారన్నారు. ఇందిరమ్మ, గాంధీ పోటోలు పెట్టుకొని మ్యానిఫెస్టో చూపి ప్రజలను దగా చేశారన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ పరితీరును ప్రజల్లో ఎండగట్టడానికి బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, విజయ్‌కుమార్, గట్టయ్య, వంశీ, ఆసీఫ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:19 AM