సీఎం హోదాలో రాజన్న ఆలయానికి రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Nov 21 , 2024 | 01:06 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బుధవారం దర్శనం చేసుకున్నారు. ఉదయం 10.57 నిమిషాలకు రాజన్న ఆలయ గుడి చెరువు వద్ద హెలికాప్టర్ దిగిన సీఎం నేరుగా రాజన్న ఆలయానికి చేరుకున్నారు. రాజన్న ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో పోలీసలు గౌరవ వందనం చేశారు. ఆలయ అర్చకులు సీఎంకు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
- ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
- రాజన్నకు కోడెమొక్కు చెల్లింపు, ప్రత్యేక పూజలు
వేములవాడ కల్చరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి బుధవారం దర్శనం చేసుకున్నారు. ఉదయం 10.57 నిమిషాలకు రాజన్న ఆలయ గుడి చెరువు వద్ద హెలికాప్టర్ దిగిన సీఎం నేరుగా రాజన్న ఆలయానికి చేరుకున్నారు. రాజన్న ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో పోలీసలు గౌరవ వందనం చేశారు. ఆలయ అర్చకులు సీఎంకు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర దేవస్థానం ఆవరణలో ధర్మగుండం వద్ద రూ. 76 కోట్లతో చేపట్టే ఆలయాభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పురోహితులు రాజన్న ఆలయ స్థల పురాణాన్నివివరించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద సీఎం కోడెను కట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించిన సీఎం ముందుగా లక్ష్మీగణపతిస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి వద్ద అర్చన, రాజరాజేశ్వరస్వామికి అభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ స్వామివారి శేషవస్ర్తాలను అందజేశారు. సీఎం వెంట మంత్రులు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఉన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 01:06 AM