కార్పొరేషన్‌కు వీధి దీపాలు సమకూర్చిన ఆర్‌ఎఫ్‌సీఎల్
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:35 AM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలు సమకూర్చాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తికి ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం స్పందించింది.
కోల్‌సిటీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలు సమకూర్చాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తికి ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం స్పందించింది. రూ.16లక్షల విలువైన వీధి దీపాల ను సమకూర్చింది. మంగళవారం ఆర్‌ఎఫ్‌సీఎల్ సీజీఎం ఉదయ రాజ హన్స ఆదేశాల మేరకు జనరల్ మేనేజర్ ప్రదీప్ వర్ష్నే రూ.11.55లక్షల విలువగల 90వాట్ల 340 ఎల్‌ఈ డీలైట్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేషనల్ ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ రాంజీ, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముస్తాఫా తదితరులకు అందజేశారు. ఆగస్టు 27న రూ.5లక్షల విలువగల 150 వీధి దీపాలను ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం మున్సిపల్ కార్పొరేషన్‌కు అందించింది. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఎండీ శర్వానన్ వీధి దీపాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. దీంతో మరో రూ.11.55లక్షలతో కొనుగో లుచేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుం డంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పరిశ్రమల సహకా రం తీసుకుంటున్నారన్నారు. కార్పొరేషన్‌లోని ప్రధాన రహదారుల్లో వీధి దీపాలు లేక చీకట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో వీధి దీపాలు సమకూర్చాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యాన్ని కోరారన్నారు. ఈ మేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం విడుతల వారీగా సుమారు 500లైట్లను సమకూర్చిందని ఆయన పేర్కొ న్నారు. పరిశ్రమలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఎన్‌టీ పీసీ నుంచి గౌతమినగర్ వరకు వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. త్వర లోనే అవి అందుబాటులోకి వస్తాయన్నారు. విపక్షాలు జరుగుతున్న అభివృద్ధిని జీర్ణిం చుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొక్కిరాల శ్రీనివాసరావు, తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాష్, నాయిని ఓదెలు, గట్ల రమేష్, సాం బమూర్తి, దూళికట్ట సతీష్, దాసరి విజయ్, కళ్యాణి సింహాచలం పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:35 AM